మూడంతస్తుల భవనం పై నుంచి నాలుగు నెలల పసికందును విసిరేసిన కోతి.. శిశువు స్పాట్ డెడ్

Published : Jul 18, 2022, 05:16 AM IST
మూడంతస్తుల భవనం పై నుంచి నాలుగు నెలల పసికందును విసిరేసిన కోతి.. శిశువు స్పాట్ డెడ్

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వానరం ఇంటి పై కప్పు నుంచి నాలుగు నెలల పసికందుకును కిందకు విసిరేసింది. దీంతో ఆ శిశువు స్పాట్‌లోనే మరణించింది.  

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ కోతి శిశువు ప్రాణాలు తీసింది. నాలుగు నెలల శిశువును ఓ కోతి లాక్కుని మూడు అంతస్తుల భవనం పై నుంచి కిందకు విసిరేసింది. దీంతో ఆ శిశువు కింద పడి మరణించింది. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది.

బరేలీ జిల్లా దుంకా గ్రామానికి చెందిన నిర్దేశ్ ఉపాధ్యాయ్ (25)కు నాలుగేళ్ల కొడుకు ఉన్నాడు. నిర్దేశ్ ఉపాధ్యాయ్, ఆయన భార్యలు మూడు అంతస్తుల భవనం పైకి వెళ్లారు. ఆ భవనం టెర్రస్ పై నాలుగేళ్ల తమ కుమారుడితో కలిసి శుక్రవారం సాయంత్రం వాకింగ్ చేశారు. అదే సందర్భంలో ఓ కోతి మూక అటు వైపుగా వచ్చింది. వాటిని వేరే వైపుగా వెళ్లగొట్టాలని ఆ దంపతులు ప్రయత్నించారు. కానీ, ఆ కోతులు అటు వెళ్లకుండా వీరిద్దరి వైపుగానే వచ్చాయి. ముఖ్యంగా కొడుకును ఎత్తుకుని నిలుచున్న నిర్దేశ్ ఉపాధ్యాయ్‌ను చుట్టుముట్టాయి. 

వెంటనే ఆయన అక్కడి నుంచి మెట్ల వైపు పరుగెత్తే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే తన కుమారుడు ఒడిలో నుంచి జారిపోయాడు. మళ్లీ వెంటనే ఎత్తుకోవడానికి ప్రయత్నించగా.. ఓ కోతి ఆ బాలుడిని అందుకుని ఇంటి పై కప్పు నుంచి కిందకు వదిలిపెట్టింది. ఆ శిశువు కింద పడింది. స్పాట్‌లోనే మరణించింది.

తమకు ఈ ఘటన గురించి తెలిసిందని బరేలీ చీఫ్ ఫారెస్ట్ కన్జర్వేటర్ లలిత్ వర్మ చెప్పారు. దర్యాప్తు చేపట్టడానికి తాము ఓ ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ టీమ్‌ను పంపించినట్టు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..