నేడు కింగ్ చార్లెస్ పట్టాభిషేక వేడుక.. భారత్ నుంచి ఎవరెవరు హాజరు కానున్నారంటే ?

Published : May 06, 2023, 11:32 AM IST
నేడు కింగ్ చార్లెస్ పట్టాభిషేక వేడుక.. భారత్ నుంచి ఎవరెవరు హాజరు కానున్నారంటే ?

సారాంశం

నేడు లండన్ లోని బంకింగ్ హమ్ ప్యాలెస్ లో జరిగే కింగ్ చార్లెస్- 3 పట్టాభిషేక వేడుకకు భారత్ నుంచి పలువురు అతిథులుగా హాజరయ్యారు. వారిలో భారత ఉప రాష్ట్రపతి, ఆయన సతీమణి, సోనమ్ కపూర్, ముంబైకి చెందిన డబ్బా వాలాలు ఉన్నారు. వీరితో పాటు మరి కొంత మంది ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటున్నారు. 

నేడు లండన్ లో కింగ్ చార్లెస్- 3 పట్టాభిషేకం జరగనుంది. అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి మన దేశం నుంచి పలువురు ప్రముఖులకు ఆహ్వానం వచ్చింది. దీంతో వారందరూ ఇప్పటికే లండన్ కు చేరుకున్నారు. ఇందులో భారత ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్ కర్, నటి సోనమ్ కపూర్ ఉన్నారు.

బారాముల్లాలో ఎన్ కౌంటర్, లష్కరే ఉగ్రవాది హతం.. కొనసాగుతున్న ఆపరేషన్

భారత ప్రభుత్వం తరుఫున అధికారికంగా ప్రాతినిధ్యం వహించేందుకు ఉపరాష్ట్రపతి ధన్ కర్ తో పాటు ఆయన సతీమణి సుదేశ్ ధన్ కర్ కూడా లండన్ వెళ్లారు. కామన్వెల్త్ వర్చువల్ గాయక బృందాన్ని పరిచయం చేయడానికి సోనమ్ కపూర్ కూడా అక్కడికి చేరుకున్నారు. వీరితో పాటు ముంబైకి చెందిన ఇద్దరు డబ్బావాలాలు పట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొంటున్నారని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ నివేదించింది. రాజుకు బహుమతిగా ఇవ్వడానికి వార్కారీ కమ్యూనిటీ తయారు చేసిన పుణేరి తలపాగా, శాలువాను కొనుగోలు డబ్బా వాలాలు కొనుగోలు చేశారు. 

2003లో చార్లెస్ తన భారత పర్యటన సందర్భంగా ముంబైలోని ప్రఖ్యాత లంచ్ బాక్స్ డెలివరీ బాయ్స్ ను కలిశారు. చార్లెస్ - కెమిల్లా పార్కర్ బౌల్స్‌ వివాహానికి కూడా డబ్బావాలాలకు ఆహ్వానం అందింది. లండన్ కింగ్ స్వచ్ఛంద కార్యక్రమాలతో సంబంధం ఉన్న అనేక మంది భారతీయ కమ్యూనిటీ వర్కర్లకు కూడా ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. వీరిలో సెల్ఫ్ మేడ్ కన్సల్టెంట్, చెఫ్ కూడా ఉన్నారు.

మేఘాలయకు పాకిన కుకీ, మైతేయ్ వర్గాల మధ్య ఘర్షణలు.. హింసాత్మక ఘటనల నేపథ్యంలో 16 మంది అరెస్టు..

చార్లెస్ ఫౌండేషన్ బిల్డింగ్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్, ప్రిన్స్ ఫౌండేషన్ స్కూల్ ఆఫ్ ట్రెడిషనల్ ఆర్ట్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పుణెకు చెందిన 37 ఏళ్ల ఆర్కిటెక్ట్ సౌరభ్ ఫడ్కేను కూడా ఈ వేడుకకు ఆహ్వానించారు. గత ఏడాది ప్రిన్స్ ట్రస్ట్ గ్లోబల్ అవార్డు అందుకున్న 33 ఏళ్ల గుల్షా కూడా ఈ జాబితాలో ఉంది. ఆమె ఢిల్లీకి చెందినవారని, ఇప్పుడు ఒక కన్సల్టెన్సీ సంస్థలో పనిచేస్తోందని, నిర్మాణ ప్రాజెక్టులకు ధరల అంచనాలను అందిస్తుందని బకింగ్ హామ్ ప్యాలెస్ తెలిపింది.

చెదలను నివారిస్తామని చెప్పి.. బెడ్ రూమ్ లోకి వెళ్లిన దుండగుడు.. తరువాత ఏం జరిగిందంటే ?

గత మే నెలలో ప్రిన్స్ ట్రస్ట్ కెనడా యూత్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన అతిథుల జాబితాలో కెనడాకు చెందిన భారత సంతతి జే పటేల్ కూడా ఉన్నారు. టొరంటోలోని ప్రఖ్యాత సీఎన్ టవర్ లో చెఫ్ ఉద్యోగం సంపాదించినట్లు ప్యాలెస్ తెలిపింది. కాగా.. బ్రిటన్ తొలి భారత సంతతి ప్రధాని రిషి సునక్ పట్టాభిషేక కార్యక్రమంలో బైబిల్ గ్రంథం కొలొసియన్ల నుంచి పఠించనున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి అక్షతామూర్తి కూడా జెండా మోసేవారి ఊరేగింపుకు నేతృత్వం వహిస్తారు. ఈ వేడుకలో ఆయన ఇతర భారత సంతతి సహచరులు వివిధ మతాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. లార్డ్ ఇంద్రజిత్ సింగ్ సిక్కు మతానికి, ఇండో-గయానీస్ వారసత్వానికి చెందిన లార్డ్ సయ్యద్ కమల్ల్ ముస్లిం విశ్వాసానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్