బెలూన్లతో స్మృతి ఇరానీ ఫోటో.. సూపర్ అంటున్న ఫ్యాన్స్..!

Published : May 06, 2023, 10:19 AM IST
 బెలూన్లతో స్మృతి ఇరానీ ఫోటో.. సూపర్ అంటున్న ఫ్యాన్స్..!

సారాంశం

కాగా, శుక్రవారం ఆమె ఓ ఫోటో షేర్ చేయగా, అవి ఆమె అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. దీంతో వైరల్ గా మారింది.

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తనకు నచ్చిన విషయాలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. తన ఫోటోలతో పాటు, ఆసక్తికర విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా కాస్త డల్ గా ఉన్నప్పుడు ఆమె సోషల్ మీడియా ఎకౌంట్ చూస్తే, ఆమె పోస్టులకు కచ్చితంగా నవ్వేస్తారు. అంత సరదాగా ఉంటాయి. కాగా, శుక్రవారం ఆమె ఓ ఫోటో షేర్ చేయగా, అవి ఆమె అభిమానులకు విపరీతంగా నచ్చేసింది. దీంతో వైరల్ గా మారింది.

ఇప్పుడు వైరల్ అవుతున్న పోస్ట్‌ను స్మృతి ఇరానీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. పోస్ట్‌లో ఆమె కెమెరాను చూసి నవ్వుతూ, కొన్ని బెలూన్‌లను పట్టుకున్న ఆమె ఫోటో ఉంది. ఆమె శుక్రవారం క్యాప్షన్‌లో "FriYAY" అని కూడా పిలిచింది.

"Fri’YAY'. మరొక వారాంతపు పని కోసం ఎదురుచూసే వారందరికీ," ఆమె క్యాప్షన్‌లో రాసింది.

 


ఆమె అభిమానులు, అనుచరులకు మధురమైన చిత్రం తెగ నచ్చేసింది. లైకులతో పాటు, కామెంట్ల వర్షం కూడా కురిపిస్తున్నారు. "సూపర్ క్యూట్" అని ఒక నెటిజన్,  "క్యూట్‌నెస్ ఓవర్‌లోడ్" అని ఇలా కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం. కాగా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ  ప్రస్తుతం  మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు 1.3 మిలియన్  ఫాలోవర్స్ ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్