ఆర్టికల్ 370 రద్దుకు మద్దతివ్వం, వ్యతిరేకించం: టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ

By Nagaraju penumalaFirst Published Aug 6, 2019, 2:57 PM IST
Highlights

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. తాము బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదు, అలాగని వ్యతిరేకించడం లేదని తమ అభిప్రాయాలను వెల్లడించారు. 
 

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు వల్ల జమ్ముకశ్మీర్ ను మరింత అస్థిరతలోకి నెట్టే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ. లోక్ సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన జమ్ము కశ్మీర్‌ పునర్విభజన బిల్లు పై మాట్లాడిన సుదీప్ బందోపాధ్యాయ బిల్లుకు తాము మద్దతు ఇవ్వడం కానీ, వ్యతిరేకించడం గానీ చేయడం లేదని తెలిపారు. 

జమ్ము కశ్మీర్‌ను రాష్ట్రంగానే కొనసాగిస్తే వచ్చిన నష్టం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర విభజన వంటి నిర్ణయాలు తీసుకొనేటప్పుడు అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఉంటే బాగుండేదని తెలిపారు. 

ఆర్టికల్ 370 రద్దు, జమ్ముకశ్మీర్ విభజన వల్ల కశ్మీర్‌ను మరింత అస్థిరతలోకి నెట్టే అవకాశం ఉందన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతిలో ఉన్న ప్రతీ ఒక్కరూ కశ్మీర్ తో అనుబంధం కలిగి ఉండాలని కోరుకుంటారని తెలిపారు. 

మరోవైపు జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు అయిన ఒమర్ అబ్ధుల్లా, మెహబూబా ముఫ్తీలను గృహనిర్బంధంలో ఉంచాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. ఈ చర్యల వల్ల జమ్ముకశ్మీర్ ప్రాంతాల్లో నిరసనలు చెలరేగుతాయని అభిప్రాయపడ్డారు.  

ఇకపోతే అంతకు ముందు ఆర్టికల్ 370 రద్దుపై స్పందించారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత, పశ్చిమబంగాల్ సీఎం మమతా బెనర్జీ. జమ్ము కశ్మీర్ పునర్వ్ వ్యవస్థీకరణ బిల్లుకు తాము మద్దతు ఇచ్చేది లేదని తెలిపారు. తాము ఓటింగ్ లో కూడా పాల్గొనబోమని స్పష్టం చేశారు. 

కేంద్ర ప్రభుత్వం జమ్ముకశ్మీర్ పై నిర్ణయం తీసుకునే ముందు ఇతర పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఉంటే బాగుండేదన్నారు. కశ్మీరీల అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకుని ఉంటే బాగుండేదని తెలిపారు.  

తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లోక్ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. తాము బిల్లుకు మద్దతు ఇవ్వడం లేదు, అలాగని వ్యతిరేకించడం లేదని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టికల్ 370 రద్దు చేస్తారా, ఆ అధికారం పార్లమెంట్ కు ఉంది: లోక్ సభలో తివారీ వర్సెస్ షా

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

click me!