ఐఎఎస్ టాపర్స్ టీనా, అధర్ దంపతులు: విడాకుల కోసం ధరఖాస్తు

Published : Nov 22, 2020, 12:51 PM IST
ఐఎఎస్ టాపర్స్ టీనా, అధర్ దంపతులు: విడాకుల కోసం ధరఖాస్తు

సారాంశం

ఐఎఎస్ టాపర్స్ జంట టీనా దాబి, అధర్ ఖాన్ రాజస్థాన్ లోని జైపూర్ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు ధరఖాస్తు చేసుకొన్నారు.

న్యూఢిల్లీ: ఐఎఎస్ టాపర్స్ జంట టీనా దాబి, అధర్ ఖాన్ రాజస్థాన్ లోని జైపూర్ ఫ్యామిలీ కోర్టులో విడాకులకు ధరఖాస్తు చేసుకొన్నారు.

పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయం తీసుకొన్నారు. 2015లో యూపీఎస్‌సీ పబ్లిక్ పరీక్షల్లో   టీనా ఫస్ట్ ర్యాంకు వచ్చింది. అధర్ రెండో ర్యాంక్ సాధించాడు.

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన అమీర్ ... టీనా దబీని పెళ్లి చేసుకొన్నాడు.  వీరిద్దరూ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన క్యాడర్ అధికారులుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరికి జైపూర్ లో పోస్టింగ్ ఇచ్చారు.

ఐఎఎస్ ట్రైనింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత పెళ్లి చేసుకొన్నారు. మత సామరస్యం యొక్క చిహ్నంగా పలువురు ప్రశంసించారు.  హిందూ మహాసభ దీన్ని ప్రేమ జిహాద్ గా పేర్కొన్న విషయమైంది.

టీనా దాబీ తన ఇంటి పేరు నుండి ఖాన్ పేరును తొలగించింది. సోషల్ మీడియాలో ఈ  విషయమై చర్చకు దారితీసింది. మరోవైపు అధర్ కూడ ఇన్ స్టాగ్రామ్ లో ఆమెను అనుసరించడాన్ని మానివేశారు.

డీఓపీటీ కార్యాలయంలో 2015 మే 11వ తేదీన టీనా దాబీ, అధర్ అమర్ ఉల్ షఫీ ఖాన్ లు తొలిసారి కలుసుకొన్నారు.


 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?