ఆహారం దొరకక ఆకలితో పులి మృతి.. కార్బెట్ నేషనల్ పార్క్ లో ఘటన

Published : May 22, 2023, 01:19 PM IST
ఆహారం దొరకక ఆకలితో పులి మృతి.. కార్బెట్ నేషనల్ పార్క్ లో ఘటన

సారాంశం

వృద్ధాప్యం కారణంగా వేటాడలేకపోవడంతో ఆకలితో ఓ పులి మరణించింది. ఉత్తరాఖండ్ కార్బెట్ నేషనల్ పార్క్ లోని పఖ్రో రేంజ్ లో ఈ ఘటన జరిగింది. ఖాళీ కడుపుతోనే అది చనిపోయిందని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. 

ఉత్తరాఖండ్ కార్బెట్ నేషనల్ పార్క్ లోని పఖ్రో రేంజ్ లో ఓ పులి చనిపోయింది. అయితే శనివారం రాత్రి ఆలస్యంగా వచ్చిన పోస్టుమార్టం నివేదికలో ఆ పులి ఆకలితో చనిపోయిందని, కడుపు ఖాళీ కావడంతోనే ఈ మరణం సంభవించిందని నిర్ధారణ అయ్యింది. కాగా.. ఈ మరణంతో ఇటీవల కాలంలో ఈ నేషనల్ పార్క్ లో మరణించిన పులుల సంఖ్య నాలుగుకు చేరింది.

అరుణాచల్ ప్రదేశ్ లో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 4.5 తీవ్రత నమోదు..

ఉత్తరాఖండ్ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ డాక్టర్ సమీర్ సిన్హా తెలిపిన వివరాల ప్రకారం.. కార్బెట్ నేషనల్ పార్క్‌లో ఈ పులి అపస్మారక స్థితిలో కనిపించింది. ఆ పులి చాలా ముసలిదని, అప్పటికే చాలా బలహీనంగా ఉందని, అందుకే దాటిని కాపాడలేకపోయామని చెప్పారు. అయితే వృద్ధాప్యం కారణంగా పులి వేట కోసం ఎక్కువ దూరం నడవలేక పోయిందని, దీంతో ఆకలితో అది స్పృహతప్పి పడిపోయిందని కాలాగఢ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్ వో) నీరజ్ శర్మ తెలిపారు. దీంతో దానికి అక్కడే సిబ్బంది ప్రథమ చికిత్స అందించారని, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ధేలా రెస్క్యూ సెంటర్ కు తరలిస్తుండగా మరణించిందని పేర్కొన్నారు.

ఇంటి పైకప్పుపై బాణాసంచా తయారు చేస్తుండగా పేలుడు.. ముగ్గురు మృతి.. ఎక్కడంటే ?

ఇటీవలి కాలంలో పులుల మరణాలు సంభవించడం ఇది నాలుగోసారి. అంతకు ముందు ఓ పులిని ఫారెస్ట్ గార్డు కాల్చి చంపాడు. మరో రెండు పులులు అనుమానాస్పద స్థితిలో మరణించాయి. అయితే ఆ రెండు పులులు ఎలా మరణించాయో అనే విషయాన్ని ఇంత వరకు అటవీ శాఖ బహిర్గతం చేయలేదు. అయితే పఖ్రోలో చెట్ల నరికివేత కారణంగా చీతాల్ (మచ్చల జింకలు) సంఖ్యతో పాటు అన్ని వన్యప్రాణుల సంఖ్య పడిపోయిందని తెలుస్తోంది. దీంతో పులుల వేటకు కొరత ఏర్పడింది. 

నెమలి ఈకలు పీకి, చిత్ర హింసలు పెట్టి చంపిన యువకుడు.. వీడియో తీస్తూ పైశాచికానందం.. సోషల్ మీడియాలో వైరల్

కాగా.. పులుల జనాభాను పరిరక్షించేందుకు పదేళ్ల క్రితమే ప్రత్యేక కార్బెట్ టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు అటవీ శాఖ వర్గాలు తెలిపాయి. దీనికి అయ్యే ఖర్చును నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ) భరించాల్సి ఉంది. ఈ పథకం కోసం చాలా పేపర్ వర్క్ చేసినా అది కార్యరూపం దాల్చలేదు. 

PREV
click me!

Recommended Stories

Ahmedabad International Kite Festival సంక్రాంతి సంబరాల్లో పతంగ్ లు ఎగరేసిన మోదీ| Asianet News Telugu
Digital Health : ఇక వైద్యరంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ... కీలక పరిణామాలు