గుజరాత్ లో భారీ వర్షాలు.. గోడకూలి ముగ్గురి దుర్మరణం.. పిడుగుపడి మరొకరు..

Published : Jun 13, 2022, 12:23 PM IST
గుజరాత్ లో భారీ వర్షాలు.. గోడకూలి ముగ్గురి దుర్మరణం.. పిడుగుపడి మరొకరు..

సారాంశం

గుజరాత్ లో భారీ వర్షాలకు ఒకే కుటుంబంలోని ముగ్గురు మరణించారు. మరో చోట పిడుగుపడి ఓ మహిళ మృతి చెందింది. గుజరాత్ ను భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. 

గుజరాత్ : Gujarat రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న Heavy rains వల్ల గోడ కూలి ఓ కుటుంబంలోని ముగ్గురు మరణించారు.  సోమవారం ఉదయం 6 గంటల వరకు గుజరాత్లోని 91 తాలూకాల్లో  భారీ వర్షంతో, ఉరుములతో కూడిన జల్లులు పడ్డాయి. మోర్బీ జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఇంటి గోడ కోల్పోవడంతో ఒక కుటుంబంలోని ముగ్గురు సభ్యులు మరణించారని పోలీసులు తెలిపారు. హల్వా తాలూకా  పరిధిలోని  sundari bhavani గ్రామంలో  ఆదివారం అర్థరాత్రి బాధితులు తమ ఇంట్లో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. 

గోడ కూలడంతో ఒక మహిళ, ఆమె భర్త, సోదరుడు గాయపడి అక్కడికక్కడే మరణించారు. మీరంతా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులైనని హల్వాద్ పోలీసులు తెలిపారు. గ్రామస్తుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మోర్బీలోని ఆస్పత్రికి తరలించారు. ఆదివారం సాయంత్రం జికియారి గ్రామంలో పిడుగుపాటుకు గురై ఓ మహిళ మృతి చెందినట్లు మరో అధికారి తెలిపారు. మహిసాగర్, జునాగఢ్, అమ్రేలి, దాహోద్  జిల్లాల్లోని 11 తాలూకాలలో 25 మిల్లీ మీటర్ల నుంచి 75 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదయింది.  morbi జిల్లాలోని హల్వాద్, వంకనేర్, టంకరా తాలూకాలలో భారీ వర్షాలు కురిశాయి. 

బావిలో జారిపడి మహిళ మృతి.. తట్టుకోలేక ఆమె చితిలో దూకిన యువకుడు...

ఇదిలా ఉండగా, ఈ నెల మొదట్లో బ్రెజిల్ లో వ‌ర‌ద‌లు బీభ‌త్సం సృష్టించాయి. దీంతో ప్ర‌జ‌ల‌కు తీవ్ర అసౌక‌ర్యం క‌లిగింది. దిగువ ప్రాంతాలు నీటితో మునిగిపోయాయి. ఎంతో మంది నిరాశ్ర‌యులయ్యారు. ముఖ్యంగా ఈశాన్య బ్రెజిల్ లో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో కొండచరియలు విరిగిపడటం, వ‌ద‌ర నీటి ప్ర‌భావంతో తీవ్ర ప్రాణ న‌ష్టం జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వ‌ర‌ద‌ల వ‌ల్ల 106 మంది మృతి చెందారు. 

బ్రిజెల్ లో ఈ వర్షాల వల్ల పెర్నాంబుకో అత్యధికంగా ప్రభావితమయ్యింది. ఇక్క‌డ అనేక చోట్ల కొండ చ‌రియ‌లు విరిగిపడటంతో రాష్ట్ర రాజధాని రెసిఫ్ లో ఇల్లు దెబ్బతిన్నాయి. గల్లంతైన వ్యక్తులను గుర్తించడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎఎఫ్ బీ నివేదిక ప్ర‌కారం.. మే 28న వరదనీరు చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో ప్ర‌వహించ‌డంతో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. దాదాపు 14మంది గల్లంతయ్యారు. అని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారులు పేర్కొన్నారు.

వర్షాల వల్ల పెర్నాంబుకోలోని సుమారు 24 మున్సిపాలిటీలు అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి. రాష్ట్రంలో 6వేలమందికి పైగా ఇల్లు కోల్లోయారు. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో పరిస్థితిని సమీక్షించారు. సోమవారం బోల్సోనారో తాను హెలికాప్టర్లో విపత్తు ప్రాంతం మీదుగా ఎగురుతున్న వీడియోలను పోస్ట్ చేశారు. ‘‘నేను దిగడానికి ప్రయత్నించాను. కానీ హెలికాప్టర్ కిందకు దించే పరిస్థితి లేదని, నేల అస్థిరంగా ఉందని చెప్పారు. హెలిక్యాప్ట‌ర్ కింద‌కి దిగితే ప్ర‌మాదం జరుగుతుందని చెప్పారు. కాబట్టి మా నిర్ణయాన్ని విరమించుకుకున్నాం’’ అని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?