National Herald Case: "స‌త్య‌మే గెలుస్తోంది": రాబర్ట్ వాద్రా భావోద్వేగ పోస్ట్

Published : Jun 13, 2022, 12:20 PM IST
National Herald Case: "స‌త్య‌మే గెలుస్తోంది": రాబర్ట్ వాద్రా భావోద్వేగ పోస్ట్

సారాంశం

National Herald case: కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీపై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ప్రియాంకా గాంధీ భ‌ర్త‌, వ్యాపార‌వేత్త రాబ‌ర్ట్ వాద్రా అన్నారు. రాహుల్ నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) విచార‌ణ ఎదుర్కోనున్న నేప‌థ్యంలో రాబ‌ర్ట్ వాద్రా ఫేస్‌బుక్‌లో ఓ భావోద్వేగ  పోస్ట్ చేశారు. 

National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నేడు ప్రశ్నించనుంది. ఈ క్ర‌మంలో కార్యకర్తల భారీ నిరసనలు చేప‌ట్టారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

రాబర్ట్ వాద్రా భావోద్వేగ పోస్ట్

ఇదిలా ఉండగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ముందు రాహుల్ గాంధీ హాజరు కావడానికి ముందు.. ప్రియాంకా గాంధీ భ‌ర్త‌, వ్యాపార‌వేత్త రాబ‌ర్ట్ వాద్రా.. రాహుల్ గాంధీకి సంఘీభావం తెలిపారు. అతను అన్ని నిరాధార ఆరోపణల నుండి విముక్తి పొందుతాడు. తనపై నమోదైన కేసును ప్రస్తావిస్తూ.. ఈడీ తనకు 15 సార్లు స‌మ‌న్లు పంపి.. ప్రశ్నించిందని వాద్రా తెలిపారు. 

రాబ‌ర్ట్ వాద్రా త‌న‌ ఫేస్‌బుక్‌లో ఉద్వేగభరితమైన పోస్ట్ వ్రాస్తూ.. ఇలా అన్నాడు - నేను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి 15 సార్లు సమన్లు పొందాను. ప‌లుమార్లు వారి విచార‌ణ‌ను ఎదుర్కొన్నాను. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చాను. ఇప్పటివరకు నేను సంపాదించిన మొదటి రూపాయికి కూడా లెక్క చెప్పాను.  23,000 కంటే ఎక్కువ పత్రాలను ఈడీకి అందించాను. అని రాసుకోచ్చారు. 
 
అలాగే.. రాబర్ట్ వాద్రా  మ‌రో ఫేస్‌బుక్ పోస్ట్‌లో ఇంకా ఇలా వ్రాశాడు. "సత్యం గెలుస్తుందని, ప్రస్తుత వ్యవస్థపై ప్ర‌భుత్వ అణచివేత ఉంటుందని, దేశ ప్రజలను కూడా అణచివేస్తుంది అని పేర్కొన్నారు.  ప్రతి రోజు సత్యం కోసం పోరాడాలి. దేశ ప్రజలు మాతో నిలబడతారు. అని అన్నారు. 

ఎప్ప‌టికీ స‌త్య‌మే గెలుస్తుంది. వేధింపుల‌కు గురిచేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఏది సాధిస్తుందని ప్ర‌శ్నించారు.  ఇటువంటి వేధింపులతోనే  ప్ర‌జ‌ల గ‌ళాన్ని మ‌రింత బల‌ప‌డుతాయ‌ని అన్నారు. త‌మకు మ‌ద్ద‌తు తెలుపుతున్న ప్ర‌జ‌ల త‌ర‌ఫున, సత్యం కోసం పోరడానికే తాము ఉన్నామ‌ని చెప్పుకొచ్చారు.

PREV
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు