ఈడీ కార్యాలయంలో రాహుల్ గాంధీ.. వాంగ్మూలం నమోదు చేయనున్న ఇద్దరు ఉన్నతాధికారులు..!

Published : Jun 13, 2022, 12:05 PM ISTUpdated : Jun 13, 2022, 12:08 PM IST
ఈడీ కార్యాలయంలో రాహుల్ గాంధీ.. వాంగ్మూలం నమోదు చేయనున్న ఇద్దరు ఉన్నతాధికారులు..!

సారాంశం

నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు అందుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ వెంబడి ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈడీ కార్యాలయంకు వచ్చారు. 

నేషనల్ హెరాల్డ్ కేసులో నోటీసులు అందుకున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ వెంబడి ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా కూడా ఈడీ కార్యాలయంకు వచ్చారు. ఈడీ కార్యాలయంలో అధికారులు రాహుల్ గాంధీని ప్రశ్నించనున్నారు. ఇద్దరు ఉన్నతాధికారులు రాహుల్ గాంధీ వాంగ్మూలం నమోదు చేయనున్నట్టుగా తెలుస్తోంది. పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్ 50 ప్రకారం రాహుల్ గాంధీ వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు. ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రశ్నలు అడుగుతారని.. డిప్యూటీ డైరెక్టర్ ప్రశ్నలను పర్యవేక్షించనున్నారని సమాచారం. మరో అధికారి రాహుల్ గాంధీ సమాధానాలను టైప్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, ఈడీ విచారణకు ముందు రాహుల్ గాంధీ నిజం మాట్లాడతానని ప్రమాణం చేసినట్టుగా సమాచారం. అయితే రాహుల్‌ను నేడు ఐదు నుంచి ఆరు గంటల పాటు ఈడీ అధికారులు విచారించే అవకాశం ఉన్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. మరోవైపు సోదరుడు రాహుల్‌తో పాటు ఈడీ  కార్యాలయానికి వచ్చిన ప్రియాంక గాంధీ.. కొద్దిసేపటి తర్వాత అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారు. 

అంతకు ముందు ఈ రోజు ఉదయం ప్రియాంక గాంధీ.. రాహుల్ నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రాహుల్, ప్రియాంకలు ఏఐసీసీ కార్యాలయానికి వచ్చారు. అనంతరం అక్కడి నుంచి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. అయితే రాహుల్ వెంట పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈడీ కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరిన రాహుల్, ప్రియాంకలను పోలీసులు.. అక్కడి నుంచి వాహనంలో తీసుకెళ్లారు. 

ఇక, ఏఐసీసీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున చేరకున్న కాంగ్రెస్ శ్రేణులు.. రోడ్డుపై బైఠాయించి ఆందోళ చేసేందుకు యత్నిస్తున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించేందుకు సిద్దం అవుతున్నారు. మరోవైపు ఈడీ చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త కాంగ్రెస్ శ్రేణులు నిరసనలు చేపడుతున్నారు. రాహుల్ విచారణ కొనసాగినంత సేపు ఈ ఆందోళన సాగుతాయని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

ఇక, నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఆమె కుమారుడు రాహుల్‌ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) బుధవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  ఈ నెల 2న రాహుల్‌ ఈడీ ముందు హాజరవ్వాల్సి ఉన్నది. అయితే అదేసమయంలో ఆయన విదేశీ పర్యటనలో ఉండటంతో నేటికి వాయిదాపడింది. కాగా, ఇదే కేసులో కాంగ్రెస్‌ అధినేత్రి జూన్‌ 23న ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్