మూడు ద‌శ‌బ్దాల నిరీక్ష‌ణ‌కు తెర‌.. జ‌మ్మూ కాశ్మీర్ లో సినిమా హాళ్లు రీ ఓపెన్..

By team teluguFirst Published Oct 1, 2022, 1:31 PM IST
Highlights

దాదాపు 30 ఏళ్ల తరువాత జమ్మూ కాశ్మీర్ లో సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యాయి. శ్రీనగర్ లోని ఓ మల్లీప్లెక్స్ లోని రెండు స్క్రీన్ లలో రెండు సినిమాలను ప్రదర్శించారు.

జమ్మూ కాశ్మీర్ లో సినీ ప్రేమికుల నిరీక్షణకు ఇప్పుడు తెరపడింది. మూడు దశాబ్దాల తర్వా త తొలిసారిగా నేడు కాశ్మీర్ లో మల్టీప్లెక్స్ ప్రారంభ‌మైంది. శ్రీనగర్ లో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మనోజ్ సిన్హా ఈ మల్టీప్లెక్స్ ను ప్రారంభించారు. దీని వ‌ల్ల జమ్మూ కాశ్మీర ప్ర‌జ‌ల‌కు దాదాపు 30 ఏళ్ల త‌రువాత థియేట‌ర్ లో సినిమా చూసే అవ‌కాశం ల‌భించింది.

5జీ ప్రారంభం.. 130 కోట్ల మంది భారతీయులకు టెలికాం పరిశ్రమ అందించిన బహుమతి: ప్రధాని మోదీ

అప్‌టౌన్ శ్రీనగర్‌లోని శివపోరా ప్రాంతంలో అత్యంత సురక్షితమైన INOX మల్టీప్లెక్స్ థియేటర్‌ను ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నట్లు మల్టీప్లెక్స్ యజమాని, ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ ధర్ తెలిపారు. ఈ మల్టీ ప్లెక్స్ లో 520 సీట్ల సీటింగ్ కెపాసిటీతో మూడు సినిమా థియేటర్లు ఉన్నాయి. అయితే నేడు రెండు మాత్ర‌మే ఓపెన్ అయ్యాయి.

నిర్భయ గ్యాంగ్ రేప్: పదేళ్ల బాలుడిపై ముగ్గురు ఫ్రెండ్స్ లైంగికదాడి.. ప్రైవేట్ పార్టులో రాడ్లు.. బాధితుడి మరణం

ఒక స్క్రీన్ లో హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ నటించిన విక్రమ్ వేధా ప్ర‌ద‌ర్శించ‌గా.. మ‌రో స్క్రీన్ లో సౌత్ ఇండియ‌న్ మూవీ అయిన పొన్నియిన్ సెల్వన్ 1 (PS1) ప్ర‌ద‌ర్శించారు. వాస్త‌వానికి సెప్టెంబ‌ర్ 20వ తేదీన జ‌మ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఈ మ‌ల్టీప్లెక్స్ ల‌ను ప్రారంభించారు. ఆనాడు అమీర్ ఖాన్ న‌టించిన లాల్ సింగ్ చ‌ద్దా చిత్రాన్ని ప్రేక్షకుల‌తో క‌లిసి ఆయ‌న వీక్షించారు.

మైనర్ల అబార్షన్లను రహస్యంగా ఉంచొచ్చు. పోలీసులకు చెప్పాల్సిన అవసరం లేదు.. సుప్రీంకోర్టు..

ఈ మల్టీప్లెక్స్‌లోని ఒక్కో థియేటర్‌లో రోజూ ఉదయం 10 గంటల నుంచి నాలుగు షోలు ప్రదర్శిస్తామని విజయ్ ధర్ కుమారుడు వికాస్ ధర్ తెలిపారు. మల్టీప్లెక్స్‌లో అత్యాధునిక పరికరాలను అమర్చామని, తాజా బాలీవుడ్, హాలీవుడ్ మరియు సౌత్ కాశ్మీర్ సినిమాలు దేశవ్యాప్తంగా విడుదలైన తేదీన మల్టీప్లెక్స్‌లో ప్రదర్శిస్తామ‌ని ఆయ‌న చెప్పారు. అయితే మూడు దశాబ్దాలుగా లోయలో సినిమా హాళ్లు లేని తర్వాత ప్రజలు మల్టీప్లెక్స్‌ను సందర్శిస్తారని భావిస్తున్నారా అని మీడియా ఆయ‌న‌ను ప్ర‌శ్నించిన‌ప్పుడు.. “కశ్మీర్ ప్రజలకు భారతీయ చలనచిత్ర పరిశ్రమతో ప్రేమపూర్వ‌క సంబంధం ఉంది. ఈ ప్రేమ నిద్రాణంగా ఉండిపోయినా, అది ఇప్పుడు మళ్లీ పుంజుకుంటుంది ’’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

వచ్చే 5 రోజులు ఏపీ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు : ఐఎండీ

1990లో మిలిటెన్సీ విస్ఫోటనం తర్వాత ఉగ్రవాదులు కశ్మీర్‌లోని సినిమా హాళ్లను మూసివేయాలని ఆదేశించారు. ప్రభుత్వం 1999లో మూడు సినిమా హాళ్లను పునఃప్రారంభించాలని ప్రయత్నించినా ఆ ప్రయత్నం సఫలం కాలేదు. 
 

click me!