అయోధ్య రామమందిరంపై ఉగ్రదాడి ముప్పు..! భద్రత పెంచిన నిఘాసంస్థలు..!

By SumaBala Bukka  |  First Published Nov 11, 2023, 6:45 AM IST

అయోధ్యలోని రామ మందిరాన్ని 2024 జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.


న్యూఢిల్లీ : ఉగ్రదాడి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అయోధ్యలోని రామమందిరం చుట్టూ సాయుధ బలగాలు భద్రతను పెంచాయి. నిర్మాణంలో ఉన్న రామమందిరంపై పాకిస్థాన్ మద్దతుతో కూడిన ఉగ్రవాద సంస్థలు అల్-ఖైదా, లష్కే-ఈ-తోయిబాల భారీ దాడికి దిగబోతున్నట్లు సమాచారం అందడంతో  భద్రతా సంస్థలు నిఘా పెంచాయి. నిర్మాణంలో ఉన్న రామ మందిర ప్రాజెక్టును 22 జనవరి 2024న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన అడ్వయిజరీని కూడా త్వరలోనే విడుదల చేయనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

రామ మందిర ప్రారంభోత్సవానికి  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకావాలని ఇప్పటికే ట్రస్ట్ సభ్యులు ఆయనను ఆహ్వానించారు. వారి ఆహ్వానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ అంగీకరించారు. 2024జనవరి 22వ తేదీన అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నరేంద్ర మోడీ హాజరు కానున్నారని సమాచారం.

Latest Videos

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. శబరిమల వివరాలు అందించే మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వం

జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి తర్వాత రామ్ లల్లా ప్రతిష్టాపన ప్రక్రియ ప్రారంభించి 10 రోజులపాటు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలయ ట్రస్టు నిర్ణయించింది. దీంతో ఆలయ గ్రౌండ్ ఫ్లోర్ పనులు డిసెంబర్ చివరికల్లా పూర్తిగా అయ్యేలా వేగవంతం చేశారు. 2020 ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. 

click me!