పూరీ జగన్నాథ ఆలయంలో భక్తుల రద్దీ.. తోపులాటలో 30 మందికి గాయాలు

Puri Jagannath Temple: పూరీ జగన్నాథ ఆలయం సింహద్వార్ వద్ద బారికేడ్ల వెనుక పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉన్నప్పటికీ వలంటీర్లు వందలాది మంది హబీష్యాలీలను బస్సుల్లో తీసుకువచ్చి ఆలయ ద్వారం వద్ద వదిలేశారు. బారికేడ్లు ఎత్తివేయడంతో అందరూ ఒక్క‌సారిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
 


Shree Jagannath Temple: ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో శుక్రవారం మంగళ హారతి దర్శనం సందర్భంగా తొక్కిసలాట జరగడంతో 30 మంది భక్తులు గాయపడ్డారు. ఉదయం ఆలయ ప్రధాన ద్వారం అయిన లయన్స్ గేటు వద్ద హబీశ్యులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో వేచి ఉన్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో ఉపవాసం పాటించే వారితో పాటు సాధారణ భక్తులు కూడా ఆలయంలోకి ఒకేసారి ప్రవేశించడంతో భారీ రద్దీ ఏర్పడిందనీ, దీనికార‌ణంగా తొక్కిస‌లాట వంటి ప‌రిస్థితులు ఏర్పాడ్డాయి.

''ప్రధాన ఆలయానికి రెండు ద్వారాలైన శాతపహాచా (ఏడు మెట్ల ద్వారం), ఘంటి ద్వార్ గుండా భక్తులు ప్రవేశిస్తుండగా, భారీ రద్దీ కారణంగా దాదాపు తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. చాలా మంది 'హబీష్యాలీలు' జారిపడగా, మరికొంత మంది కింద‌ప‌డిపోకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. ప‌లువురు తీవ్ర వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. 30 మందికి పైగా గాయ‌ప‌డ్డార‌ని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఈ ప‌రిస్థితిని గ‌మ‌నించిన ఆలయ భద్రతా సిబ్బంది, పోలీసులు వారిని ఎయిర్ కండిషన్డ్ కార్యాలయ గదికి తరలించి ఓఆర్ఎస్ అందించి దశలవారీగా జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. నెల రోజుల పాటు జరిగే కార్తీక బ్రహ్మోత్సవాలను ప్రభుత్వ ఖర్చుతో నిర్వహించేందుకు ఆలయంలో హబీష్యాలీలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు అధికార యంత్రాంగం చెబుతున్నప్పటికీ.. ఇలాంటి ఘ‌ట‌న చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

Latest Videos

దేవతామూర్తుల దర్శనం క్ర‌మంలో ఇలా జరగడంలో జగన్నాథ ఆలయ పోలీసులు (జేటీపీ), ప్రభుత్వ పోలీసుల అసమర్థతకు ఈ సంఘటన అద్దం పడుతోంది. యాత్రికుల రద్దీని సరిగా నిర్వహించకపోవడమే ఈ ఘటనకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. అప్పటికే సింహద్వార్ వద్ద బారికేడ్ల వెనుక పెద్ద సంఖ్యలో భక్తులు వేచి ఉన్నప్పటికీ వలంటీర్లు వందలాది మంది హబీష్యాలీలను బస్సుల్లో తీసుకువచ్చి ఆలయ ద్వారం వద్ద వదిలేశారు. బారికేడ్లు ఎత్తివేయడంతో అందరూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో తొక్కిస‌లాట ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అయితే, ఆలయంలో తొక్కిసలాట లాంటి పరిస్థితి లేదని పేర్కొన్న‌ పూరీ ఎస్పీ కె.విశాల్ సింగ్.. రద్దీ కారణంగా కొందరు భక్తులు స్పృహతప్పి పడిపోయారు. కొందరికి వాంతులు అయ్యాయి. చాలా మంది భక్తులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆలయంలో భక్తుల రాకపోకలు సజావుగా సాగేందుకు 15 ప్లాటూన్ల పోలీసులను మోహరించినట్లు'' ఎస్పీ తెలిపారు. రాబోయే రెండు ముఖ్యమైన పండుగ రోజులైన దీపావళి, కార్తీక పౌర్ణమి సందర్భంగా మరో ఐదు ప్లాటూన్లను జోడించనున్నట్లు'' సింగ్ తెలిపారు.

click me!