అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్.. శబరిమల వివరాలు అందించే మొబైల్ యాప్‌ను ఆవిష్కరించిన ప్రభుత్వం

By Mahesh Rajamoni  |  First Published Nov 11, 2023, 5:24 AM IST

Ayyan mobile app: అయ్యన్ మొబైల్ యాప్ లో సంప్రదాయ అటవీ మార్గాల్లోని సేవా కేంద్రాలు, మెడికల్ ఎమర్జెన్సీ యూనిట్, వసతి సౌకర్యం, ఎలిఫెంట్ స్క్వాడ్ బృందం, పబ్లిక్ టాయిలెట్లు, ప్రతి స్థావరం నుంచి సన్నిధానం వరకు దూరం, అగ్నిమాపక దళం, పోలీస్ సహాయ పోస్టు, ఎకో షాప్, ఉచిత తాగునీటి సరఫరా కేంద్రాలు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దూరం వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది.
 


Sabarimala: శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తుల కోసం వివిధ ర‌కాల స‌మాచారం అందించ‌డం కోసం ప్ర‌భుత్వం స‌రికొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది.  పంబ శ్రీరామ సాకేతం ఆడిటోరియంలో 'అయ్యన్ మొబైల్ యాప్' ను అటవీ శాఖ మంత్రి ఏకే శశీంద్రన్ ప్రారంభించారు. పెరియార్ వన్యప్రాణి అభయారణ్యం వెస్ట్ డివిజన్ ఆధ్వర్యంలో ఈ యాప్ ను రూపొందించారు. పంబ, సన్నిధానం, స్వామి అయ్యప్పన్ రోడ్, పంబ - నీలిమాల - సన్నిధానం - ఎరుమేలి - ఆజుతకడవు పంబ, సత్రం - ఉప్పుపర - సన్నిధానం మార్గాల్లో లభించే సేవలు ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉన్నాయి.

సంప్రదాయ అటవీ మార్గాల్లోని సేవా కేంద్రాలు, మెడికల్ ఎమర్జెన్సీ యూనిట్, వసతి సౌకర్యం, ఎలిఫెంట్ స్క్వాడ్ బృందం, పబ్లిక్ టాయిలెట్లు, ప్రతి స్థావరం నుంచి సన్నిధానం వరకు దూరం, అగ్నిమాపక దళం, పోలీస్ సహాయ పోస్టు, ఎకో షాప్, ఉచిత తాగునీటి సరఫరా కేంద్రాలు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దూరం వంటి సమాచారం ఈ యాప్ ద్వారా అందించ‌నున్నారు. అయ్యప్ప భక్తులు పాటించాల్సిన ఆచారాలు, సాధారణ సూచనలు కూడా ఈ యాప్ లో ఉన్నాయి. పెరియార్ వన్యప్రాణి అభయారణ్యం గొప్పతనం, శబరిమల ఆలయం గురించిన సమాచార‌మూ యాప్ లో లభిస్తుంది.

Latest Videos

గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్ అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. అయ్య‌న్ మొబైల్ యాప్ మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. కనానా మార్గం ప్రవేశ ద్వారం వద్ద క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా కూడా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాల్సిన ఎమర్జెన్సీ హెల్ప్ నంబర్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ యాప్ ఆన్లైన్, ఆఫ్లైన్ రెండింటిలోనూ పనిచేస్తుంది. ఎంచుకున్న మార్గాల్లో వివిధ హెచ్చరికలు యాప్ ద్వారా అందుతాయి. కంజీరపల్లికి చెందిన లెపర్డ్ టెక్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ సాంకేతిక సహకారంతో రూపొందించిన ఈ యాప్ సంప్రదాయ మార్గాల్లో చేరుకునే అయ్యప్ప భక్తులకు ఉపయోగపడేలా రూపొందించారు.

click me!