ప్రధాని మోడీ పర్యటనపై ఆత్మాహుతి దాడి చేస్తామంటూ బెదిరింపు లేఖ.. కేరళలో హై అలర్ట్‌

Published : Apr 22, 2023, 01:51 PM IST
ప్రధాని మోడీ పర్యటనపై ఆత్మాహుతి దాడి చేస్తామంటూ బెదిరింపు లేఖ.. కేరళలో హై అలర్ట్‌

సారాంశం

Kerala: ప్రధాని న‌రేంద్ర మోడీ పర్యటనపై బెదిరింపు లేఖ రావడంతో కేరళలో హై అలర్ట్ కొన‌సాగుతోంది. ప్రధాని మోడీ కొచ్చి పర్యటన సందర్భంగా ఆత్మాహుతి దాడి చేస్తామని బెదిరించిన లేఖలో పంపిన వ్యక్తి పేరు, ఇతర వివరాలు ఉన్నాయ‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. దీనిపై పూర్తి విచార‌ణ జ‌రుపుతున్న‌ట్టు పేర్కొన్నాయి.   

PM Modi-threat letter: ప్రధాని న‌రేంద్ర మోడీ పర్యటనపై బెదిరింపు లేఖ రావడంతో కేరళలో హై అలర్ట్ కొన‌సాగుతోంది. ప్రధాని మోడీ కొచ్చి పర్యటన సందర్భంగా ఆత్మాహుతి దాడి చేస్తామని బెదిరించిన లేఖలో పంపిన వ్యక్తి పేరు, ఇతర వివరాలు ఉన్నాయ‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. దీనిపై పూర్తి విచార‌ణ జ‌రుపుతున్న‌ట్టు పేర్కొన్నాయి. 

వివ‌రాల్లోకెళ్తే.. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర కార్యాలయానికి బెదిరింపు లేఖ రావడంతో కేరళలో హై అలర్ట్ ప్రకటించారు. ఏప్రిల్ 24న మోడీ కొచ్చి పర్యటన సందర్భంగా ఆత్మాహుతి దాడికి పాల్పడతామని బెదిరించినట్లు లేఖలో పేర్కొన్నారు. లేఖలో పేర్కొన్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు, అయితే అతని పేరును ప్రత్యర్థులు ఇరికించడానికి ఉపయోగించారని పేర్కొంటూ అతను తన ప్రమేయం లేద‌ని తెలిపాడు. ఈ క్ర‌మంలోనే భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసి కేంద్ర దర్యాప్తు సంస్థలు మరిన్ని వివరాలను రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల నుంచి కోరాయి.

ఇదిలావుండగా, భద్రతా చ‌ర్య‌ల‌కు సంబంధించి ప‌లు అంశాల‌ను వివరిస్తూ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాసిన లేఖ మీడియాకు లీకైంది. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) తో సహా అనేక ఇతర తీవ్రమైన బెదిరింపు భావనలను కూడా ఎడిజిపి లేఖలో హైలైట్ చేశారు. కేరళకు చెందిన విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ ఈ లీకేజీపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ఇది రాష్ట్ర పోలీసుల తీవ్రమైన తప్పిదమని అన్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ షెడ్యూల్డ్ కార్యక్రమాలన్నీ జరుగుతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ స్పష్టం చేశారు.

ఏప్రిల్ 24న కొచ్చికి, మరుసటి రోజు తిరువనంతపురంలో రాష్ట్రంలో తొలి వందేభారత్  ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించేందుకు ప్ర‌ధాని మోడీ కేర‌ళ ప‌ర్య‌ట‌న‌కు రానున్నారు. తన పర్యటనలో ప్రధాని కార్యక్రమాన్ని వివరిస్తూ,  బీజేపీ అగ్రనేత రోడ్ షో నిర్వహిస్తారనీ, బహిరంగ సభలో ప్రసంగిస్తారని సురేంద్రన్ ఇంతకు ముందు చెప్పారు.

ప్రధాని కేరళ పర్యటన రాష్ట్ర అభివృద్ధికి ఊతమిస్తుందన్నారు. ఈ పర్యటనపై కేరళ ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. "ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆయనకు స్వాగతం పలుకుతారు. కేరళ రాజకీయ మార్పుకు నాంది పలికే సదస్సు 'యువం'. పార్టీ రాజకీయాలకు అతీతంగా కేరళ అభివృద్ధిని కోరుకునే యువత ఇందులో పాల్గొంటుందని" తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్