36 గంటల్లో 5300 కిలో మీటర్లు.. ఏప్రిల్ 24, 25 తేదీల్లో ప్రధాని మోడీ పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ ఇదే..

Published : Apr 22, 2023, 01:07 PM IST
36 గంటల్లో 5300 కిలో మీటర్లు.. ఏప్రిల్ 24, 25 తేదీల్లో ప్రధాని మోడీ పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ ఇదే..

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 24,25 తేదీల్లో తీరిక లేకుండా గడపనున్నారు. ఉత్తరభారతం మొదలుకొని దక్షిణ భారతం వరకు, అలాగే మధ్య, పశ్చిమ భారతదేశంలో ప్రధాని పర్యటన సాగనుంది. ఈ సందర్భంగా ఆయన 36 గంటల్లో 5300 కిలో మీటర్లు ప్రయాణించనున్నారు.

ఈ నెల 24, 25 తేదీల్లో ప్రధాని మోడీ బిజీ బిజీగా ఉండనున్నారు. ఈ రెండు రోజుల్లో ఆయన మొదట ఉత్తరాన ఉన్న ఢిల్లీలో తన ప్రయాణాన్ని ప్రారంభించి, మధ్య భారతమైన మధ్యప్రదేశ్ కు చేరుకుంటారు. తరువాత దక్షిణాన ఉన్న కేరళకు, ఆ తరువాత పశ్చిమాన కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు.

ప్రజల సొమ్మును పార్టీల విస్తరణ కోసం కాకుండా దేశాభివృద్ధికి ఉపయోగించాలే చూడాలి - బ్యూరోక్రాట్లకు ప్రధాని సలహా

ప్రధానమంత్రి ఏప్రిల్ 24న ఉదయం ప్రధాని ప్రయాణం ప్రారంభిస్తారు. ఢిల్లీ నుంచి ఖజురహో వరకు సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణిస్తారు. తరువాత ఖజురహో నుంచి రేవాకు వెళ్లి అక్కడ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 280 కిలోమీటర్ల మేర ప్రయాణించి తిరిగి ఖజురహో చేరుకుంటారు. ఖజురహో నుంచి కొచ్చికి విమానం ద్వారా సుమారు 1700 కిలోమీటర్ల దూరం ప్రయాణించి యువమ్ సదస్సులో పాల్గొంటారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. కేవలం రెండు స్థానాల్లోనే ఎంఐఎం పోటీ.. ఎందుకంటే ?

మరుసటి రోజు ఉదయం కొచ్చి నుంచి తిరువనంతపురం వరకు సుమారు 190 కిలోమీటర్లు ప్రయాణించి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను జెండా ఊపి ప్రారంభిస్తారు. అక్కడ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి నుంచి సూరత్ మీదుగా సిల్వస్సాకు 1570 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ నమో మెడికల్ కాలేజీని సందర్శిస్తారు. వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత దేవ్కా సీఫ్రంట్ ప్రారంభోత్సవం కోసం డామన్ కు వెళ్తారు. తరువాత సూరత్ కు చేరుకుంటారు. సూరత్ నుండి సుమారు 110 కిలోమీటర్లు ప్రయాణించి తిరిగి ఢిల్లీకి వెళతారు. ఈ పవర్ ప్యాక్డ్ షెడ్యూల్ లో ప్రధాని సుమారు 5300 కిలో మీటర్ల దూరాన్ని ప్రయాణించనున్నారు. ఈ ప్రయాణమంతా కేవలం 36 గంటల్లోనే పూర్తవనుంది. 
 

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu