ఆసుపత్రిలోనే డాక్టర్ బాబు రాసలీలలు.. సిబ్బందితో రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్.. చివరకు..

By team teluguFirst Published Oct 29, 2021, 4:46 PM IST
Highlights

ప్రజలకు వైద్యం అందించాల్సిన డాక్టర్.. ఆస్పత్రిలోనే రాసలీలు కొనసాగించాడు. మహిళా సిబ్బందితో హాస్పిటల్‌లో రొమాన్స్ చేసేవాడు. పని సమయంలోనే అతడు మహిళా సిబ్బందితో చనువుగా ఉండేవాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. 
 

ప్రజలకు వైద్యం అందించాల్సిన డాక్టర్.. ఆస్పత్రిలోనే రాసలీలు కొనసాగించాడు. మహిళా సిబ్బందితో హాస్పిటల్‌లో రొమాన్స్ చేసేవాడు. పని సమయంలోనే అతడు మహిళా సిబ్బందితో చనువుగా ఉండేవాడు. రోగులను పట్టించుకోకుండా ఆస్పత్రిలోనే ఎంజాయ్ చేసేవాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఓ మహిళ పోలీసును ఆశ్రయించడంతో డాక్టర్ బాగోతం వెలుగుచూసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్ పట్టి సమీపంలో చోటుచేసుకుంది. స్థానికంగా కూడా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. 

Also read: అరటి పండ్ల లోడ్‌లో 110 కిలోల గంజాయి.. ఎల్‌బీ నగర్‌లో పట్టుకున్న పోలీసులు.. విశాఖ ఏజెన్సీ నుంచి..

వివరాలు.. Thoothukudi జిల్లా కోవిల్‌పట్టి సమీపంలోని ఇళయరసానందల్‌లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో (Primary Health Centre) కురుసామి(51) వైద్యుడిగా పనిచేస్తున్నాడు. అతను అదే ప్రాంతంలో సొంతంగా శ్రీ ముత్తయ్య క్లినిక్ పేరుతో క్లినిక్‌ను నడుపుతున్నాడు. అయితే అతడు ఆస్పత్రిలో పనిచేస్తున్న మహిళ సిబ్బందితో అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. వారితో రొమాన్స్ చేసేవాడు. అంతేకాకుండా ఆస్పత్రికి వచ్చే పెషేంట్లను వేధింపులకు గురిచేసేవాడు.

Also read; సీఎం అవ్వడం కోసం రాలేదు.. కేంద్రం దాదాగిరిని అనుమతించం.. గోవాలో మమతా బెనర్జీ

ఆస్పత్రి పని గంటల్లోనే సిబ్బందితో రాసలీలలు సాగించేవాడు. తాను రొమాన్స్ చేస్తున్న సమయంలో రోగులు లోనికి రాకుండా అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న తాత్కాలిక సిబ్బందిని బయట కాపాలా ఉండమనేవాడు. అయితే ఆస్పత్రిలో మహిళా సిబ్బందితో పనివేళ్లలో కురుసామి చేసిన రొమాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Also read: బాలీవుడ్‌ను ముంబై నుంచి తరలించే కుట్ర.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర మంత్రి

అయితే ఇందులో గేటు వద్ద కాపాలా పెట్టిన తాత్కాలిక ఉద్యోగిని హస్తం ఉందని కురుసామి భావించాడు. ఆమెపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె ఫోన్‌ తీసుకుని బెదిరింపులకు పాల్పడ్డాడు. చంపేస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలోనే తాత్కాలిక ఉద్యోగిని పోలీసులను ఆశ్రయించింది. డాక్టర్ కనీసం సెలవు కూడా ఇవ్వకుండా వేధిస్తున్నాడని తెలిపింది. తనపై దాడి చేయాలని చూస్తున్నాడని, బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ క్రమంలోనే పోలీసులు డాక్టర్ కురుస్వామిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత డాక్టర్ పాడుపనులు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. ఇక, పోలీసులు కురుసామిపై IPC సెక్షన్లు 294(b), 379(B), 506(ii), తమిళనాడు మహిళా వేధింపుల నిషేధ చట్టంలోని సెక్షన్ 4 కింద కేసు నమోదు చేశారు.

click me!