పాక్ గెలుపుపై సంబరాలు చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు : యోగి ఆదిత్యనాథ్

By AN TeluguFirst Published Oct 29, 2021, 3:09 PM IST
Highlights

మెగా టోర్నీలో భారత్ తొలిసారి పాక్ చేతిలో ఓటమిని చవి చూడటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీమిండియా అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే భారత్లో ఉంటున్న కొందరు మాత్రం pak  విజయాన్ని వేడుక చేసుకున్నారు. 

టీ 20 ప్రపంచ కప్ 2021లో భారత్పై పాక్ గెలుపొందిన అనంతరం సంబరాలు చేసుకున్న వారిపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్ గా రియాక్ట్‌ అయ్యారు. అలా చేసిన వారిపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. సీఎం Yogi Adityanath ఆదేశాలతో యూపీ పోలీసులు ఇప్పటికే ఆగ్రా, బరేలీ, బదావున్‌, సీతాపూర్ జిల్లాల్లో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.

వీరిలో నలుగురు పాక్ అనుకూల నినాదాలు చేశారు అని రుజువు కావడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ipc section 504/506, ఐటీ చట్టంలోని 66(ఎఫ్‌) సహా ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. T 20 world cupలో భాగంగా అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియాపై పాక్‌ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

మెగా టోర్నీలో భారత్ తొలిసారి పాక్ చేతిలో ఓటమిని చవి చూడటంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టీమిండియా అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే భారత్లో ఉంటున్న కొందరు మాత్రం pak  విజయాన్ని వేడుక చేసుకున్నారు. 

బాణాసంచా కాల్చుతూ.. pakistan అనుకూల నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో UP ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాకు చెందిన నఫీసా  అనే ప్రైవేట్ స్కూల్ టీచర్ పాక్‌ గెలుపును సెలబ్రేట్ చేసుకుంటూ వాట్సాప్ లో స్టేటస్ పెట్టింది. ఇందుకు ఆమెను సస్పెండ్ చేయడంతో పాటు అక్కడి పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 

ఇండియాపై గెలవడంతో పాక్‌ను ప్రశంసిస్తూ వాట్సాప్ స్టేటస్ .. ముగ్గురు ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌ను సస్పెండ్..

స్టేటస్ పెట్టింది.. సస్పెండ్ అయ్యింది...
రాజస్థాన్ లోని ఉదయపూర్ జిల్లాకు చెందిన నఫీసా అత్తారి అనే ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు పాకిస్తాన్ క్రికెట్ జట్టు విజయం అనంతరం సంబరాలు చేసుకుని ఉద్యోగాన్ని కోల్పోయింది. 

స్థానికంగా ఉండే నీర్జా మోదీ అనే స్కూల్ లో పనిచేసే నఫీసా.. పాక్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తన వాట్సాప్ లో స్టేటస్ పెట్టింది. ఇందులో ‘మేం గెలిచాం’ అంటూ పాక్ ఆటగాళ్ల ఫోటోలు whatsapp status పెట్టింది.

ఇది గమనించిన విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒకరు మీరు పాక్ కు మద్దతు ఇస్తున్నారా?  అని Nafisaను ప్రశ్నించగా... ఆమె అవుననే సమాధానం చెప్పింది దీంతో చిర్రెత్తిపోయిన సదరు తల్లిదండ్రులు... నఫీసా వాట్సాప్ స్టేటస్ స్క్రీన్ షాట్ లను Social mediaలో షేర్ చేశారు 

ఇది కాస్త వైరల్ కావడంతో పాఠశాల యాజమాన్యం నఫీసాను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ మేరకు టెర్మినేషన్ లెటరును జారీ చేసింది. ఇది కూడా వైరల్ కావడంతో దీనిపై సర్వత్రా చర్చ నడుస్తుంది. 

ముగ్గురు విద్యార్థులు సస్పెండ్...

ఇదిలా ఉండగా.. టీ20 ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో భారత్‌పై  పాకిస్తాన్ విజయం సాధించిన తర్వాత పాక్ ఆటగాళ్లను (Pakistan players) ప్రశంసిస్తూ వాట్సాప్ స్టేటస్ పోస్ట్ చేసిన ముగ్గురు విద్యార్థులను ఓ ఇంజనీరింగ్ కాలేజ్ సస్పెండ్ చేసింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 

ముగ్గురు విద్యార్థులు.. అర్షీద్ యూసఫ్, ఇనాయత్ అల్తాఫ్ షేక్, షౌకత్ అహ్మద్ గనై ఆగ్రాలోని రాజ బల్వంత్ సింగ్ ఇంజనీరింగ్ టెక్నికల్ క్యాంపస్‌కు చెందినవారు. వీరు ముగ్గురి స్వస్థలం జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir). వీరు పాకిస్తాన్‌కు అనుకూలంగా పోస్ట్‌లు చేసినందరకు హాస్టల్ నుంచి వారిని సస్పెండ్ చేశారు. 

click me!