పార్లే-జి నుండి చాక్లెట్ ఫ్లేవర్‌తో బిస్కట్?: నెట్టింట చర్చ, మీమ్స్

Published : Mar 06, 2024, 12:37 PM ISTUpdated : Mar 06, 2024, 12:39 PM IST
 పార్లే-జి నుండి చాక్లెట్ ఫ్లేవర్‌తో  బిస్కట్?: నెట్టింట చర్చ, మీమ్స్

సారాంశం

ఇంటర్నెట్ లో  పార్లే-జి కొత్త ప్రొడక్ట్ పై  నెటిజన్లు చర్చిస్తున్నారు. చాక్లెట్ ప్లేవర్ తో కొత్త ప్రొడక్ట్ పై  పార్లే -జి అధికారిక ప్రకటన వెలువడలేదు.

న్యూఢిల్లీ: పార్లె-జి బిస్కట్ ను దేశంలో ప్రతి ఒక్కరూ తిని ఉంటారు.  టీ తో పాటు ఈ బిస్కట్ ను  తీసుకొనేందుకు ప్రసిద్ది చెందింది.  దేశంలో అత్యధికంగా అమ్ముడౌతున్న బ్రాండ్‌లలో ఇది ఒకటి.

 

పార్లే-జి నుండి చాక్లెట్ వేరియంట్ పేరుతో  కొత్త ప్రొడక్ట్ గురించి ఇంటర్నెట్ లో చర్చ సాగుతుంది. డార్క్ పార్లే-జి ఫోటో ఇంటర్నెట్ లో  వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో  పలువురు నెటిజన్లు  ఐకానిక్ బిస్కట్ రుచి గురించి ఊహగానాలు చేస్తున్నారు.

 

ఈ బిస్కట్ గురించి  సోషల్ మీడియాలో మీమ్స్ సందడి చేస్తున్నాయి. అయితే పార్లే సంస్థ నుండి ఈ కొత్త ఉత్పత్తిపై  ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కానీ , సోషల్ మీడియా నిండా పోస్టులు హోరేత్తుతున్నాయి.

 

పార్లే సంస్థ నుండి కొత్త ప్రొడక్ట్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పార్లే-జి బిస్కట్ కు సంబంధించిన పాత ఫోటోను ఎఐతో  నవీకరించి ఉంటారని  మరికొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. పార్లే-జి చాక్లెట్ బిస్కట్ కు సంబంధించిన ఉత్పత్తిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికి దీని రుచిపై నెటిజన్లు  ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

వందేమాతర గేయాన్ని సోనియా గాంధీ అడ్డుకున్నారా.? పంద్రాగ‌స్టు రోజు అస‌లేం జ‌రిగింది.?
అమర వీరులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన నివాళి |Droupadi Murmu Pays Homage at National War Memorial