ఈ పాము వీడియోలు చూస్తే ఎంతటివారైనా భయపడతారు..!

Published : Feb 15, 2023, 01:15 PM IST
ఈ పాము వీడియోలు చూస్తే ఎంతటివారైనా భయపడతారు..!

సారాంశం

ఆ పామును బయటకు తీసే క్రమంలో ఏకంగా సీలింగ్ ఊడి కింద పడిపోయింది.  ఇది ఎక్కడ జరిగింది అనేది తెలియదు కానీ... నెట్టింట మాత్రం వైరల్ గా మారింది. 

ఇంటర్నెలో ప్రతిరోజూ చాలా మంది వేలల్లో వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారు. వాటిలో పాములకు సంబంధించిన వీడియోలు కూడా అనేకం ఉంటాయి. అయితే... ఈ వీడియో మాత్రం  పాములను చూస్తే మాత్రం విపరీతంగా భయపడిపోతారు. అంత భయంకరంగా ఉంటాయి ఈ పాములు. మీ ఇంట్లోకి  పాము దూరింది అని ఒకసారి ఊహించుకోండి. ఆ ఊహే భయానకంగా ఉంది కదా.. అలాంటిది రెండు పెద్ద పాములు ఇంటి సీలింగ్ లోకి దూరి కనిపిస్తే ఇంకేమైనా ఉందా... ఓ వ్యక్తికి ఆ అనుభవమే ఎదురైంది. ఆ పామును బయటకు తీసే క్రమంలో ఏకంగా సీలింగ్ ఊడి కింద పడిపోయింది.  ఇది ఎక్కడ జరిగింది అనేది తెలియదు కానీ... నెట్టింట మాత్రం వైరల్ గా మారింది. వీడియో పూర్తి వివరాల్లోకి వెళితే...

 

ఈ వీడియోను లాన్స్ అనే వ్యక్తి  ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ వీడియోని  మొదట టిక్ టాక్ లో పోస్టు చేశారు. తర్వాత ట్విట్టర్ లో షేర్ చేశారు. వీడియోలో కనిపిస్తున్న దాని ప్రకారం  కొంతమంది వ్యక్తులు ఇంటి పైకప్పు నుండి పామును తీయడానికి ప్రయత్నిస్తున్నారు. మొదట, పాము తోక మాత్రమే కనిపిస్తుంది. కానీ తర్వాత ఇంటి పైకప్పు అకస్మాత్తుగా విరిగిపోయింది. అది ఒకటి కాదు రెండు పాములు... అతి పెద్ద పాములు అనే విషయం  స్పష్టంగా అర్థమౌతోంది.


ఈ వీడియోకు 14 మిలియన్లకు పైగా వ్యూస్,  టన్నుల కొద్దీ కామెంట్స్  వచ్చాయి. భారీ సరీసృపాన్ని చూసి జనం షాక్‌కు గురయ్యారు. ఈ వీడియో చూస్తే తమకు చాలా బయం వేసిందని చాలా మంది కామెంట్స్ చేయడం గమనార్హం.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !