40 చపాతీలు, 10 ప్లేట్ల భోజనం: క్వారంటైన్ కేంద్రంలో చుక్కలు చూపిస్తున్నాడు

By narsimha lode  |  First Published May 29, 2020, 3:13 PM IST

బీహార్ రాష్ట్రంలోని  కరోనా సోకిన అనూప్ ఓజా అనే వ్యక్తికి తిండి పెట్టలేక క్వారంటైన్ నిర్వాహకులు తలలు పట్టుకొంటున్నారు. పది మంది తినే తిండిని ఒక్కడే తింటున్నాడని అధికారులు ఆందోళన చెందుతున్నారు.ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
 



పాట్నా: బీహార్ రాష్ట్రంలోని  కరోనా సోకిన అనూప్ ఓజా అనే వ్యక్తికి తిండి పెట్టలేక క్వారంటైన్ నిర్వాహకులు తలలు పట్టుకొంటున్నారు. పది మంది తినే తిండిని ఒక్కడే తింటున్నాడని అధికారులు ఆందోళన చెందుతున్నారు.ఈ విషయమై ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.

అనూప్ ఓజా అనే 23 ఏళ్ల వ్యక్తి ఉపాధి కోసం రాజస్థాన్ వెళ్లాడు. లాక్ డౌన్ విధించడంతో ఆయన స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. స్వంత ఊరికి వచ్చిన అతడిని బక్సర్‌లోని  మంజ్‌వారీ క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు.

Latest Videos

undefined

also read:వలస కూలీల బస్సు ఛార్జీలను ప్రభుత్వాలే భావించాలి: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

అనూప్ తినే భోజనానికి అధికారులు తలలు పట్టుకొంటున్నారు. ప్రతి రోజూ ఉదయం పూట 40 చపాతీలు, మధ్యాహ్నం ఎనిమిది నుండి 10 ప్లేట్ల భోజనం తింటున్నాడు. క్వారంటైన్ కేంద్రాలకు ప్రభుత్వం పరిమిత సంఖ్యలోనే ఆహర సామాగ్రి అందిస్తోంది. అనూప్ కారణంగా త్వరగానే ఆహార పదార్ధాలు అయిపోతున్నాయి. 

అంతేకాదు పిండి పదార్ధాలు కూడ త్వరగానే అయిపోయాయి. దీంతో క్వారంటైన్ కేంద్రం అధికారులు అనూప్ తిండి గురించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్వారంటైన్ కేంద్రాన్ని ఉన్నతాధికారులు ఒక్క రోజు ఆకస్మాత్తుగా తనిఖీ చేశారు. వారి ముందే ఓజా పది ప్లేట్ల భోజనం తిన్నాడు. అతడికి సరిపడే భోజనం పెట్టాలని వంటవాళ్లకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. 

click me!