చనిపోయి ప్లాట్ ఫారం పై పడిఉన్న తన తల్లి శవాన్ని లేపడానికి ప్రయత్నిస్తున్న చిన్నారి వీడియో యావత్ దేశాన్ని కదిలించింది. మరోసారి వలస కార్మికుల దీనగాథను అందరికి మరోసారి గుర్తుచేసింది. ఈ విషయాన్నీ నిన్న పాట్నా హై కోర్టు విచారణకు స్వీకరించింది.
చనిపోయి ప్లాట్ ఫారం పై పడిఉన్న తన తల్లి శవాన్ని లేపడానికి ప్రయత్నిస్తున్న చిన్నారి వీడియో యావత్ దేశాన్ని కదిలించింది. మరోసారి వలస కార్మికుల దీనగాథను అందరికి మరోసారి గుర్తుచేసింది. ఈ విషయాన్నీ నిన్న పాట్నా హై కోర్టు విచారణకు స్వీకరించింది.
ఆ మరణించిన మహిళా పేరు ఆర్బీన. లాక్ డౌన్ కాలంలో గుజరాత్ లో చిక్కుబడిపోయింది. శ్రామిక రైలు ప్రారంభమవడంతో రైల్లో ముజాఫరపూర్ కు బయల్దేరింది. ట్రైన్ ముజాఫరాపూర్ చేరుకునే ముందు తిండి లేక, తీవ్రమైన దాహంతో వడదెబ్బకు మరణించిందని కుటుంబ సభ్యులు చెప్పారు.
undefined
ఇంటర్నెట్ లో ప్రజలందరిచేత కన్నీరు పెట్టించిన వీడియోలో తల్లి ఆర్బీనను లేపుతూ... ఆమె మీద కప్పి ఉన్న దుప్పటిని లాగుతున్నాడు చిన్నారి రహ్మత్. ఆ తల్లి ఎప్పటికి లేవదు అని తెలిసిన వీడియో చూస్తున్నవారందరి కండ్లు చెమర్చాయి.
ఈ ఘటనపై విచారణ చేపట్టిన పాట్నా హైకోర్టు అనేక ప్రశ్నలు లేవనీతేంది. మహిళకు పోస్ట్ మార్టం నిర్వహించారా? ఆ మహిళకు అంత్యక్రియలను సంప్రదాయాల ప్రకారం జరిపించారా లేదా, ఆమె ఎలా మరణించింది? ఆమె ఆకలికి తిండి లేక మరణించిందా? ఆ మహిళా పిల్లల సంరక్షణ ఎవరు చూసుకుంటున్నారు అని కోర్టు ప్రశ్నించింది.
బీహార్ ప్రభుత్వం తరుఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వకేట్ జనరల్ ఆమెకు మతిస్థిమితం లేదు అని పేర్కొన్నారు. పోస్ట్ మార్టం నిర్వహించలేదని, ఆమెకు మతిస్థిమితం కూడా సరిగా లేదని కోర్టుకు విన్నవించారు ప్రభుత్వం తరుఫు న్యాయవాది.
ఆర్బీన కుటుంబ సభ్యులు మాత్రం ఆమెను మతిస్థిమితం లేనిదానిగా చిత్రీకరించటంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. తమ కూతురి మానసిక స్థితి సరిగానే ఉందని, ఆమె పూర్తి ఆరోగ్యవంతురాలేనని ఆమె తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఆర్బీన కేసును ప్రభుత్వంతో వ్యక్తిగతంగా చర్చిస్తానని, ఆమెకు పూర్తిగా న్యాయం జరిగే విధంగా తగిన చర్యలు తీసుకుంటానని ప్రభుత్వ న్యాయవాది చెప్పటంతో పూర్తి వివరాలను జూన్ మూడవతారిఖు కల్లా అందజేయమని చెబుతూ ఆ రోజుకి కేసును వాయిదా వేసింది కోర్ట్.