వార్నీ.. రైల్ ఇంజన్ నే చోరీ చేసిన దొంగలు.. సొరంగం తవ్వి మరీ..

By team teluguFirst Published Nov 26, 2022, 9:43 AM IST
Highlights

బీహార్ రాష్ట్రంలో పలువురు దొంగలు షెడ్ లో ఉన్న రైలు ఇంజిన్ ను పాక్షికంగా చోరీ చేశారు.దీనిపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. 

బైక్ లు, కార్లు, బస్సులు, ఇతర వాహనాలను దొంగతనం చేయడం మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఈ కిలాడీ దొంగలు రైలు ఇంజన్ నే దొంగతనం చేశారు. ఈ ఘటన బీహార్ లోని బెగుసరాయ్ జిల్లాలో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గర్హారాలో రైల్వే యార్డులో మరమ్మతుల కోసం తీసుకొచ్చిన రైలు డీజిల్ ఇంజిన్‌ను పాక్షికంగా దొంగలించి ఎత్తుకెళ్లారు. దీని కోసం ఏకంగా దుండగులు సొరంగం కూడా తవ్వారు. ఇందులో ప్రమేయం ఉన్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

పాము, ముంగిసల మధ్య పోరు... వీడియో వైరల్...!

దీనిపై ముజఫర్‌పూర్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) ఇన్‌స్పెక్టర్ పీఎస్ దూబే మాట్లాడుతూ.. గర్హరా యార్డ్‌కు మరమ్మతుల కోసం తీసుకువచ్చిన డీజిల్ ఇంజిన్ ను ముగ్గురు దొంగలు చోరీ చేశారని అన్నారు. దీని కోసం రైల్వే యార్డుకు సొరంగం తవ్వారని, దాని ద్వారా ఇంజిన్ లోకోమోటివ్ భాగాలు, ఇతర వస్తువులను బస్తాల్లో ఎత్తుకెళ్లారని చెప్పారు.

జమ్మూలో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. మినీ బస్సులో ఐఈడీని స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు..

దీనిపై బరౌని పోలీస్ స్టేషన్‌లో గత వారం కేసు నమోదు అయ్యిందని, ముగ్గురిని అరెస్టు చేశామని తెలిపారు. విచారణలో ఆ ఇంజన్ భాగాలను ముజఫర్‌పూర్ జిల్లా ప్రభాత్ నగర్ ప్రాంతంలోని స్క్రాప్ గోడౌన్‌లో ఉంచామని చెప్పడంతో సోదాలు నిర్వహించామని అన్నారు. అక్కడి నుంచి పోలీసులు రైళ్లలో ఉపయోగించే 13 బస్తాల సామగ్రిని స్వాధీనం చేసుకున్నారని అన్నారు.

అదర్ పూనావాలా ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టి రూ. కోటి చీటింగ్.. ఏడుగురి అరెస్ట్..

స్వాధీనం చేసుకున్న వస్తువులలో ఇంజిన్ భాగాలు, పాతకాలపు రైలు ఇంజిన్ల చక్రాలు, భారీ ఇనుముతో చేసిన రైల్వే భాగాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాగా.. స్క్రాప్ గోడౌన్ యజమాని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ దొంగతానికి పాల్పడిన ముఠా స్టీల్ బ్రిడ్జిలను విప్పి వాటి భాగాలను చోరీ చేసే పనినే వృత్తిగా ఎంచుకుంది. ఇదిలా ఉండగా.. గతేడాది కూడా పూర్నియా కోర్టు ఆవరణలో ఉంచిన పాత ఆవిరి ఇంజిన్‌ కనిపించకుండా పోయింది. అయితే దీనిని విక్రయించారనే ఆరోపణలతో సమస్తిపూర్ లోకో డీజిల్ షెడ్‌కు చెందిన రైల్వే ఇంజనీర్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.
 

click me!