హోటల్లో పడ్డ ఈ దొంగలు ఏం దొంగిలించారో తెలిస్తే.. షాక్ అవుతారు...

By AN TeluguFirst Published Oct 21, 2021, 2:56 PM IST
Highlights

అరే ప్రాంతంలోని Imperial Palace అనే హోటల్ కు వెనకవైపు నుంచి దొంగలు కొద్ది రోజుల పాటు కష్టపడి అనంతరం హోటల్ లోకి ప్రవేశించి  అక్కడున్న పది అడుగుల భారీ సైనిక విగ్రహాన్ని చోరీ చేశారు.  

ముంబై :  సాధారణంగా దొంగలు పడి డబ్బు నగదు దోచుకెళ్తారు.  కానీ, ముంబైలో విచిత్ర ఘటన జరిగింది. ఓ హోటల్ లో దొంగలు పడి కొన్ని వందల కిలోల బరువు ఉన్న విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు.  అందుకోసం  పెద్ద  సొరంగం  తవ్వడం గమనార్హం. 

అరే ప్రాంతంలోని Imperial Palace అనే హోటల్ కు వెనకవైపు నుంచి దొంగలు కొద్ది రోజుల పాటు కష్టపడి అనంతరం హోటల్ లోకి ప్రవేశించి  అక్కడున్న పది అడుగుల భారీ సైనిక విగ్రహాన్ని చోరీ చేశారు.  

ఆ విగ్రహాన్ని ఇటలీలో తయారు చేశారట.  దీని ధర దాదాపు ఏడు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. కొద్ది రోజుల క్రిందట.. హోటల్ సిబ్బంది ఆ విగ్రహం కనిపించట్లేదని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.  దీంతో పోలీసులు హోటల్ వెనుక వైపు ఉన్న అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు 

ఈ huge military statueకి సంబంధించిన 300 కిలోలకు పైగా బరువు ఉన్న పలు విడి భాగాలు దొరికాయి. దర్యాప్తును ముమ్మరం చేయగా…  ఇది పావై పథాక్ అనే విగ్రహాల Gang of thieves చేసిన పనిగా గుర్తించారు. ఆ గ్యాంగ్ లో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.  

ఈ విగ్రహాన్ని పలు భాగాలుగా విడదీసి అటవీ ప్రాంతంలో దాచిపెట్టి కొన్నాళ్ల తర్వాత విక్రయించాలని దొంగలు భావించారట. అలా దొంగలు విగ్రహం  విడిభాగాలను  కుర్లాలో  విక్రయించే ప్రయత్నం చేస్తుండగా...పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.  

ఎలక్ట్రిక్ వాహనాలపై ట్యాక్సులు త‌గ్గించండి.. ప్రధాని మోదీ కార్యాలయాన్ని కోరిన టెస్లా ప్రతినిధులు..!

లాక్ డౌన్లో హోటల్ మూతపడగా…  చిన్నచిన్న కాంస్య విగ్రహాలు,  విలువైన వస్తువులు కూడా చోరీకి గురయ్యాయని హోటల్ యాజమాన్యం వెల్లడించింది. కానీ ఈసారి భారీ విగ్రహం చోరీకి గురికావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

కాళ్ళు నరికి కడియాల  దొంగతనం
ఇక రాజస్థాన్ లో జరిగిన మరో ఘటనలో దొంగలు అత్యంత పాశవికంగా ప్రవర్తించారు. ఓ మహిళను దారుణ హత్య చేశారు. కాలికున్న వెండి కడియాల కోసం 50 ఏళ్ల మహిళను కిరాతకంగా హత్య చేశారు. 

అంతేకాకుండా ఆమె murder చేసిన తరువాత కాళ్లు నరికేసి,  వాటికి ఉన్న వెండి కడియాలు దొంగిలించారు. జైపూర్లోని మంగళవారం ఈ దారుణం జరిగింది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దీంతో ఆమె మృతదేహం లభ్యమైన చోటే కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

గ్రామస్తులు కూడా వారికి మద్దతుగా నిలిచారు.  గ్రామానికి చేరుకున్న కలెక్టర్ మృతురాలి కుటుంబానికి ఎనిమిది లక్షల రూపాయల నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 
 

click me!