కోల్ కతా ఎగ్జిక్యూటివ్, డ్రైవర్ మర్డర్ కేసు.. మహిళ అరెస్ట్.. !

By AN TeluguFirst Published Oct 21, 2021, 2:15 PM IST
Highlights

ఈ జంట హత్యలు జరిగిన ప్రదేశానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమండ్ హార్బర్‌లోని మహిళ ఇంట్లో నుంచి పోలీసులు రక్తపు మరకలు ఉన్న బట్టలు స్వాధీనం చేసుకున్నారు.

కోల్‌కతా : ఆదివారంనాడు కోల్‌కతాలో సంచలనం సృష్టించిన డబుల్ మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో 42 ఏళ్ల మహిళ తాను నేరం చేయడానికి కుట్ర చేసినట్లు ఒప్పుకోవడంతో పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఈ double murder కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న ఆ మహిళ కుమారుడు పరారీలో ఉన్నాడు.

అందుతున్న సమాచారం ప్రకారం, హత్యలు జరిగిన ప్రదేశానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న డైమండ్ హార్బర్‌లోని మహిళ ఇంట్లో నుంచి పోలీసులు రక్తపు మరకలు ఉన్న బట్టలు స్వాధీనం చేసుకున్నారు.

ఆదివారం నాడు ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ కిల్‌బర్న్ ఇంజినీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్ సుబీర్ చాకి, అతని డ్రైవర్ హత్యలు కలకలం రేపాయి. వీరి మృతదేహాలు మెడ, కాళ్లు, వెనుక భాగంలో అనేక కత్తిపోట్లతో దక్షిణ కోల్‌కతాలోని గరీయాహత్ ప్రాంతంలోని సీనియర్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ ancestral houseలో కనిపించాయి. 

పోలీసుల ప్రకారం, ఆస్తి అమ్మకం గురించి వార్తాపత్రికలో వచ్చిన ప్రకటనను చూసిన మిథు హల్దార్ అనే మహిళ, ఆమె పెద్ద కుమారుడు కలిసి సుబీర్ చాకిని కలిశారు. ఆ తరువాత వారిద్దరూ ఆ బిల్డింగును కూడా చూసి వెళ్లారు. 

ఈ హత్యల నేపథ్యంలో డైమండ్ హార్బర్‌లోని ఒక టీచర్ ఇంట్లో domestic helpగా పనిచేస్తున్న మిథు హల్దార్‌ను పోలీసులు అనుమానించారు. ఆమె కొడుకు చాకీని కలిసినప్పుడు అతన్ని దోచుకోవాలని అనుకుని ప్లాన్ చేశాడు.

దీంతో వారు పక్కా ప్రణాళిక ప్రకారం ఘటన జరిగిన ఆదివారం నాడు మరోసారి చాకీని కలవాలని కోరారు. అతని ఆస్తిని కొనడానికి ఆసక్తి ఉన్నట్లు నటించి, నమ్మించారు. 

భార్య మీద కోపం.. ఆమె వివరాలు మ్యాట్రిమోనీలో పెట్టి..!

అయితే, ఈ నేరంలో వీరిద్దరే కాకుండా మరికొంత మంది వ్యక్తులు కూడా ఉన్నారని, వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.

సుబీర్ చాకీ కిల్బర్న్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, రబిన్ మండల్ దాదాపు 10 సంవత్సరాలుగా ఆయన దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఆదివారం సాయంత్రం వారు కత్తితో పొడిచి హత్య చేయబడ్డారు.

విలియమ్సన్ మాగోర్ గ్రూప్ కంపెనీ అయిన కిల్‌బర్న్ ఇంజనీరింగ్ మేనేజింగ్ డైరెక్టర్, Chaki సెయింట్ జేవియర్స్ స్కూల్, IIT ఖరగ్‌పూర్, IIM కలకత్తా పూర్వ విద్యార్థి. అతను 10 సంవత్సరాల క్రితం ముంబైకి వెళ్లే వరకు CII ఈస్ట్రన్ రీజియన్ లో యాక్టివ్ మెంబర్. అప్పటి నుండి, చాకీ తన పని నిమిత్తం ముంబై, కోల్‌కతా మధ్య షటిల్ చేస్తున్నాడు.

అతనికి తల్లి, భార్య, ఒక కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు వివాహం అయిపోయి బెంగుళూరులో ఉంటోంది. కుమారుడు లండన్‌లో పనిచేస్తున్నాడు.
రబిన్ మన్‌ఫాల్‌కు భార్య, ఒక కుమార్తె, ముగ్గురు కుమారులు ఉన్నారు.

click me!