మైనర్ బాలిక మీద రెండేళ్లుగా వృద్ధుడి అత్యాచారం.. విషయం తెలియడంతో....

Published : Oct 11, 2021, 10:30 AM IST
మైనర్ బాలిక మీద రెండేళ్లుగా వృద్ధుడి అత్యాచారం.. విషయం తెలియడంతో....

సారాంశం

మనవరాలి వయసున్న ఓ minor girl మీద కన్నేశాడో కామాంధుడు. అంతేకాదు రెండేళ్లుగా ఆ చిన్నారి మీద sexual assaultకి పాల్పడుతూ, నరకం చూపించాడో వృద్ధుడు. ఈ ఘటన జార్ఖండ్ లోని సిమ్ దేగా జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది. 

రాంచీ : దేశంలో బాలిక మీద జరుగుతున్న అఘాయిత్యాలను ఆపేందుకు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా వాటి ఫలితం మాత్రం పెద్దగా ఉండడం లేదనే చెప్పాలి. ఎందుకంటే నిత్యం ఏదో ఓ చోట మహిళలు, బాలికలు కామాంధుల చేతుల్లో బలవుతూనే ఉన్నారు.

తాజాగా ఇలాంటి అమానుష ఘటన రాంచీలో చోటు చేసుకుంది. మనవరాలి వయసున్న ఓ minor girl మీద కన్నేశాడో కామాంధుడు. అంతేకాదు రెండేళ్లుగా ఆ చిన్నారి మీద sexual assaultకి పాల్పడుతూ, నరకం చూపించాడో వృద్ధుడు. ఈ ఘటన జార్ఖండ్ లోని సిమ్ దేగా జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది. 

వివరాల్లోకి వెడితే.. 58యేళ్ల ఓ వృద్ధుడు తన ఇంటి సమీపంలోని మైనర్ బాలిక మీద కన్నేశాడు. బాలిక తండ్రి ఉపాధి నిమిత్తం కేరళలో ఉండగా, తల్లి కూలి పనులకు వెళ్లేది. వీటిని అవకాశంగా తీసుకున్న అతను.. ఇంట్లో బాలిక తల్లి లేనప్పుడు ఆమెకు మాయమాటలు చెప్పి molestionకు పాల్పడ్డాడు.

ఇక అప్పటినుంచి రెండేళ్లుగా బాలిక మీద అఘాయిత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికను బెదిరించేవాడు. అయితే బాలిక ప్రవర్తనలో మార్పు రావడం గమనించిన తల్లి.. బాలికను నిలదీయగా విషయం వెలుగులోకి వచ్చింది. 

వెంటనే బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిమీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ తరువాత బాలికను వైద్యపరీక్సలు, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

కాగా, లక్నోలో ఇలాంటి ఓ దారుణమే జరిగింది. విద్యాబుద్దులు నేర్పాల్సిన వాడే వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మాయమాటలతో విద్యార్థిణిని లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడటమే కాదు, గర్భందాల్చిన యువతికి అబార్షన్ కూడా చేయించాడో మదర్సాలో పనిచేసే ఉపాధ్యాయుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలి జిల్లాలో ఫీష్ గడ్ ప్రాంతానికి చెందిన యువతి మతపరమైన విద్యాసంస్థ అయిన మదర్సాలో చదువకునేది. అయితే అదే మదర్సాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఒకడు ఆ యువతిపై కన్నేసాడు. విద్యాబుద్దులు నేర్పాల్సిన వాడే ప్రేమిస్తున్నానంటూ సదరు యువతి వెంటపడ్డాడు.  అతడి మాయమాటలను నమ్మిన యువతి ప్రేమను అంగీకరించింది. 

కీచక టీచర్ వికృతచేష్టలు... విద్యార్థిణిపై నాలుగేళ్లుగా అత్యాచారం, అబార్షన్

కొంతకాలం ప్రేమికుడిగానే వున్న టీచర్ పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించాడు. దీంతో అతడితో శారీరకంగా కలవడానికి యువతి అంగీకరించింది. ఇలా పలుమార్లు యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు నిందితుడు. ఇలా నాలుగేళ్లుగా యువతిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడు.  

ఇటీవల యువతి గర్భం దాల్చడంతో బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడు. అయితే తామిద్దరం ప్రేమించుకున్నాం కదా ఇక పెళ్లి చేసుకుందామని యువతి సదరు టీచర్ ను కోరింది. దీంతో అతడు తన అసలు రూపాన్ని బయటపెడ్డాడు. మరోసారి పెళ్లి మాట ఎత్తితే చంపేస్తానని బెదిరించాడు. తాను మోసపోయానని గుర్తించిన బాదిత బాలిక పోలీసులను ఆశ్రయించింది.  

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu