ఏ ప్రాజెక్టులోనూ సాంకేతిక లోపం రాలేదు: ఏషియా నెట్ న్యూస్ కార్యాలయంలో ఇస్రో చైర్మెన్ సోమ్ నాథ్

By narsimha lode  |  First Published Feb 5, 2024, 9:03 PM IST

ఇస్రోకు చెందిన ఏ ప్రాజెక్టులోనూ సాంకేతిక లోపం లేదని  ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు


బెంగుళూరు: ఇస్రోకు చెందిన ఏ ప్రాజెక్టులోనూ సాంకేతిక లోపం లేదని  ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు.ఏదైనా వైఫల్యం ఉంటే, అది నిర్వహణ రంగంలో ఉంటుందన్నారు. ఈ తప్పిదానికి అందరూ బాధ్యులని  ఆయన చెప్పారు. సోమవారంనాడు  సోమ్ నాథ్  బెంగుళూరులోని ఏషియా నెట్ న్యూస్  ఏషియానెట్ సువర్ణ న్యూస్ కార్యాలయాన్ని సందర్శించారు.  ఏషియా నెట్  న్యూస్  గ్రూప్ సంస్థల ఎగ్జిక్యూటివ్   చైర్మెన్ రాజేష్ కర్ల సహా  సీనియర్ పాత్రికేయులతో  ఆయన ముచ్చటించారు.  ఇస్రోలో ఏదైనా ప్రాజెక్ట్ దాని సాధ్యత గురించి చాలా బహిరంగంగా చర్చించనున్నట్టు చెప్పారు.

 ఇలా చేస్తేనే కరెక్ట్ అనే వాదనలు, ఆలోచనలు ఉంటాయి. ప్రాజెక్ట్‌లోని ప్రతి ఒక్కరూ దీన్ని చేయవచ్చు. తమ సంస్థలో  ఏదైనా ప్రాజెక్ట్ గురించి ప్రశ్నించే సంస్కృతిని అభివృద్ధి చేసినట్టుగా ఆయన తెలిపారు. ఏదైనా ప్రాజెక్టు గురించి తుది నిర్ణయం తీసుకున్నప్పుడు దాని ప్రాజెక్ట్‌లోని ప్రతి ఒక్కరూ దానిని అంగీకరించాలన్నారు.నిర్ణయాలు తీసుకునే వరకు చర్చలు కొనసాగుతాయి. అంతర్గతంగా తమ మధ్య చాలా చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇది వివిధ దశలలో జరుగుతుందని చెప్పారు. అలాంటి చర్చలు జరగనప్పుడు కొన్నిసార్లు వైఫల్యాలు సంభవిస్తాయని సోమ్ నాథ్ తెలిపారు.  ఇస్రోలో ఎప్పుడూ సాంకేతిక లోపం రాలేదని ఆయన తేల్చి చెప్పారు.

Latest Videos

నిర్వహణలో చర్చ , ప్రశ్నించే వ్యవస్థ లేనప్పుడు, అది సాంకేతిక వైఫల్యానికి దారి తీస్తుందన్నారు.. చంద్రయాన్  యాత్రలో కూడా ఇలాంటి ఘటనే జరిగిందని, దానికి మేనేజ్‌మెంట్‌లోని వ్యక్తులు తగిన పరిష్కారం ఎలా ఇచ్చారని సోమనాథ్ అన్నారు. మేము ఎల్లప్పుడూ మంచి ఫలితాలను సాధించాలనే లక్ష్యంతో పని చేస్తామన్నారు. మహిళా శాస్త్రవేత్తలను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారనే విషయంపై మాట్లాడారు.మహిళలు అన్నింటినీ జవాబుదారీగా నిర్వహిస్తారని ఆయన చెప్పారు. ప్రతిభకు తగిన ప్రతిఫలం అందజేస్తామన్నారు.

ఇస్రోలో ప్రైవేట్ పెట్టుబడుల గురించి మాట్లాడుతూ ప్రైవేట్ పెట్టుబడులకు నియంత్రణ లేదన్నారు. అయితే, చాలా మంది పారిశ్రామికవేత్తలు తమ సొంత ఉపగ్రహాన్ని ప్రయోగించాలనే కోరికను కలిగి ఉన్నారన్నారు. అయితే ఇది ప్రారంభ దశలోనే ఉంది మరి దీనికి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలని ఆయన అభిప్రాయపడ్డారు. కనీసం ఐదు ప్రైవేటు కంపెనీలు శాటిలైట్‌ను నిర్మించేందుకు ఆసక్తి చూపాయని సోమ్ నాథ్ వివరించారు.

భారత అంతరిక్ష రంగంలో గణనీయమైన మార్పులు రానున్నాయని దేశంలోని ప్రజల్లో అవగాహన పెరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.
 అది తమకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు. పిల్లలు కూడా స్పేస్ సైన్స్ పట్ల ఆసక్తిని పెంచుకుంటున్నారని ఆయన గుర్తు చేశారు. నేడు సాంకేతికత గతంలో కంటే వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. వాతావరణంతో సహా అనేక రంగాలపై సమాచారాన్ని అందించడం మునుపటి కంటే మరింత ఖచ్చితమైనదిగా మారుతోందని ఆయన తెలిపారు. 

అమెరికా, ఐరోపా దేశాలతో పోల్చితే మన అంతరిక్ష రంగ అభివృద్ధిలో వెనుకబడి ఉన్నామన్నారు. కానీ, ఇప్పుడు భారతదేశం అందరికీ సమానం మరియు మేము మా సామర్థ్యాన్ని పెంచుకున్నట్టుగా చెప్పారు.ఎవరిపైనా ఆధారపడకుండా మనమే రాకెట్లను తయారు చేసుకునే సత్తా ఉందని సోమ్ నాథ్ తెలిపారు.  ఈ రంగంలో పరిశోధనలు చేపట్టే సత్తా ఉందన్నారు. చంద్రయాన్ మిషన్‌లో కృత్రిమ మేధస్సుపై ఆధారపడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 

దేశ ప్రజలపై మీరు ఎలాంటి ప్రభావం చూపారో మీకు తెలియదని శాస్త్రవేత్తలను కలిసిన ప్రధాని నరేంద్ర మోదీ మొదటి మాట అని సోమనాథ్ అన్నారన్నారు.ఇస్రో మైండ్ మారుతోంది: ఇస్రో ఒకప్పటిలా లేదు. మొదట్లో, ఉపగ్రహాలను ప్రజలకు ఉపయోగపడేలా చేయడమే ఇస్రో లక్ష్యమని ఆయన చెప్పారు. మత్స్యకారులు, వాతావరణం, తుఫానుల గురించి హెచ్చరికలు ఇవ్వడానికి ఉపగ్రహాలు అవసరమయ్యాయి. కానీ, ఇప్పుడు చంద్రుడు, సూర్యుడు, అంతరిక్ష కేంద్రం గురించి ఇస్రో ఆలోచిస్తోందని సోమ్ నాథ్ చెప్పారు.
 

 

click me!