ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో జైలులో ఖైదీలకు 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకింది.
న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో జైలులో 63 ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో జైళ్ల శాఖ అప్రమత్తమైంది. జైలుకు రాకముందే ఖైదీలకు ఈ ఇన్‌ఫెక్షన్ ఉందని అధికారులు చెబుతున్నారు.జైలులో ప్రవేశించిన తర్వాత ఏ ఖైదీకి హెచ్ఐవీ సోకలేదని జైలు శాఖాధికారులు స్పష్టం చేశారు. హెచ్ఐవీ సోకిన వారికి రెగ్యులర్ గా చికిత్స అందిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.గత ఐదేళ్లలో లక్నో జిల్లా జైలులో హెచ్ఐవీ సోకిన ఖైదీ ఎవరూ లేరన్నారు.
హెచ్ఐవీ సోకిన రోగులంతా లక్నోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.గత ఏడాది డిసెంబర్ లో ఉత్తర్ ప్రదేశ్ ఆరోగ్య శాఖ నిర్వహించిన ఆరోగ్య పరీక్షలో భాగంగా ఈ రోగ నిర్ధారణ జరిగింది.
also read:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది: రాజ్యసభలో వైఎస్ఆర్‌సీపీ విజయసాయి రెడ్డి
తాజాగా వైరల్ ఇన్ ఫెక్షన్ కేసులు బయటపడిన తర్వాత లక్నో సీనియర్ జైలు సూపరింటెండ్ వివరణ ఇచ్చారు. 2023 జనవరి న లక్నో నుండి విడుదలైన ఖైదీల్లో 47 మంది హెచ్ఐవి పాజిటివ్ గా తేలిందన్నారు.ఖైదీలకు హెచ్ఐవీ పరీక్షలు నిర్వహించిన సమయంలో 36 మందికి పాజిటివ్ గా తేలింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకింది.