దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రతీ చోట నాయకత్వ పోటీ ఉందని చెప్పారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కలహాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎగతాళి చేశారు. దేశ వ్యాప్తంగా ఆ పార్టీలో నాయకత్వ పోటీ ఉందని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఆయన బేలూరులో ప్రసంగిస్తూ.. కాంగ్రెస్, జేడీఎస్ పై విమర్శలు గుప్పించారు. జేడీఎస్, కాంగ్రెస్ రెండూ అస్థిరతకు చిహ్నాలేనని ఆయన అన్నారు.
‘‘దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాల నాయకత్వ వైరం ప్రతిచోటా ఉంది. చత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో ఏం జరుగుతోందో మీకు తెలుసు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అబద్ధాల గుంపు అని అక్కడి ప్రజలకు ఇప్పుడు అర్థమైంది’’ అని అన్నారు. కాంగ్రెస్ నాయకులు తమలో తాము పోరాడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన జేడీఎస్ ను కాంగ్రెస్ బీ టీమ్ గా ప్రధాని అభివర్ణించారు. ‘‘కాంగ్రెస్‌కు చెందిన జేడీఎస్ బీ టీమ్ కూడా కలలు కంటోంది. 15 లేదా 20 సీట్లు సాధించి, దోపిడిలో పాలుపంచుకోవాలని ఆశిస్తున్నారు’’ అని ప్రధాని మోడీ అన్నారు.
దారుణం.. బాకీ కట్టలేదని ఆరో తరగతి చదివే కూతురును తీసుకెళ్లి రెండో పెళ్లి చేసుకున్న 40 ఏళ్ల వ్యక్తి..
కర్నాటకలో కాంగ్రెస్, జేడీఎస్‌లు పరస్పరం వ్యతిరేకంగా ఉన్నట్టు ప్రవర్తిస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. కానీ ఎన్నికలకు ముందు ఇలాగే ఉండి, ఎన్నికల తరువాత జత కట్టారని ఆయన గుర్తు చేసుకున్నారు. కాగా.. 2018లో మాదిరిగానే హంగ్ అసెంబ్లీ ఏర్పడితే రాష్ట్రంలో బీజేపీని అధికారం నుంచి దింపేందుకు కాంగ్రెస్, కుమారస్వామిలు జట్టు కడుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని కాంగ్రెస్ కర్ణాటక చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు సీనియర్ నాయకులు తోసిపుచ్చారు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కు రావణుడి కంటే ఎక్కువ అహం - రెజ్లర్ వినేశ్ ఫోగట్
బీజేపీ అధికారంలో ఉన్న ఈ దక్షిణాది రాష్ట్రంలో రెండో సారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే పార్టీకి చెందిన ముఖ్య నాయకులు, కేంద్ర మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అనేక ర్యాలీలో పాల్గొంటారని ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయ్యింది.
16 ఏళ్ల అమ్మాయిని పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్.. వెంటనే అత్తకు ప్రమోషన్..
కర్ణాటకలో అసెంబ్లీలో మొత్తం 224 స్థానాలు ఉండగా.. ప్రస్తుత అధికార బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ గత నెల 13వ తేదీన వెలువడింది. మే 10వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఓట్ల లెక్కింపు మే 13న చేపట్టనున్నారు.