కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోంది - డిప్యూటీ సీఎం డీకే శివకుమార్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, అయితే దానిని కూలగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ అన్నారు. దీని కోసం రాష్ట్రంలో జేడీఎస్-బీజేపీ చేతులు కలిపాయని తెలిపారు.

There is a conspiracy to topple the Karnataka Congress government - Deputy CM DK Shivakumar..ISR

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆరోపించారు. పలువురు బెంగళూరు బయట వారి వ్యూహాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘మా దగ్గర కొంత సమాచారం ఉంది. ఇదీ వారి వ్యూహం. బెంగళూరులో కాకుండా బయట చేస్తున్నారు’’ అని అన్నారు.

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని భావిస్తున్న ప్రతిపక్షాలు.. కారణమేంటంటే ?

Latest Videos

రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో ఒప్పందం కుదుర్చుకోవడానికి జనతాదళ్ (సెక్యులర్) (జేడీ-ఎస్) ప్రయత్నిస్తోందని శివ కుమార్ ఆరోపించారు. దీని కోసం బెంగళూరులో కానీ, న్యూఢిల్లీలో కానీ మీటింగ్ పెట్టుకోలేక.. వారిప్పుడు సింగపూర్ వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకున్నారని అన్నారు. ‘‘కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు సింగపూర్ వెళ్లిన వారి సమాచారం నా దగ్గర ఉంది’’ అని తెలిపారు. 

యువతిపై ఆరేళ్ల బాలుడు, చనిపోయిన మహిళ అత్యాచారం - యూపీలో వింత ఘటన.. ఇంతకీ ఏం జరిగిందంటే ?

కాగా.. శివ కుమార్ వ్యాఖ్యలను జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సీఎం ఇబ్రహీం ఖండించారు. బీజేపీ, తమ పార్టీ మధ్య పొత్తు కుదిరినా.. 85 సీట్లు మాత్రమే అవుతాయని అన్నారు. రెండు పార్టీలు కలిసినా మెజారిటీ మార్క్ దాటదని అన్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఇంకా 50 సీట్లు అవసరమని చెప్పారు. ‘‘ఇప్పుడు ఆ విషయం గురించి మీరెందుకు పట్టించుకుంటున్నారు. ముందు మీ హామీలు నెరవేర్చండి... మాకు అలాంటి (ఆపరేషన్) ప్రణాళిక లేదు. శివకుమార్ కు ఏమైనా సందేహాలుంటే నేరుగా వచ్చి మాట్లాడవచ్చు.’’ అని అన్నారు.

మాజీ ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య కేసు.. నిర్దోషిగా తేలిన హర్యానా మాజీ మంత్రి గోపాల్ కందా

అయితే శివకుమార్ వాదనలను కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరెగౌడ సమర్ధించారు. ఎన్నికైన ప్రభుత్వాలను పడగొట్టిన ఖ్యాతి బీజేపీకి ఉందని అన్నారు. ‘‘ఎన్నికైన అనేక ప్రభుత్వాలను కూలదోశారు. అందుకే అప్రమత్తంగా ఉండాలి. వారికి (బీజేపీకి) మంచి, చెడు అనే స్పృహ లేదు. వారు చేసిన అప్రజాస్వామిక కార్యకలాపాలన్నీ మన ముందు ఉన్నాయి. ఉపముఖ్యమంత్రి అదే మాట అన్నారు. ఆయన వద్ద ఇంకేదైనా సమాచారం కూడా ఉండొచ్చు’’ అని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని బైరెగౌడ ఆరోపించారు. 

vuukle one pixel image
click me!