ఆసియానెట్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ తరహాలోనే కర్ణాటకలోనూ స్మార్ట్ మీటర్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. టెండర్లను తయారీదారులకు కాకుండా సరఫరాదారులకు కేటాయించడం వల్ల ధరలు పెరిగాయని, సాఫ్ట్‌వేర్ మద్దతు సంస్థ బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న కంపెనీ అని విమర్శలు వస్తున్నాయి.
కర్ణాటక ప్రభుత్వ విద్యుత్ శాఖలో భారీ కుంభకోణం చోటు చేసుకుందా? అంటే తాజాగా ఏసియానెట్ సువర్ణ న్యూస్ చానెల్, బీజీపీ ఆరోపణలను పరిగణలోకి తీసుకుంటే అవుననే అనిపిస్తోంది. అదటుంచి ఈ కుంభకోణం తీరును గమనిస్తే.. గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ నేతృత్వలోంని వైసీపీ ప్రభుత్వం ఎలాగైతే స్మార్ట్ మీటర్ల పేరిట భారీ స్కామ్ చేసిందని అప్పటి ప్రతి పక్షం టీడీపీ ఆరోపించిందో.. ఇప్పుడు కర్ణాటకలోనూ అలాగే జరుగుతోంది.
కర్ణాటకలో స్మార్ట్ మీటర్ కొనుగోలులో ఏకంగా ₹7,500 కోట్ల స్కాం జరిగిందని ప్రతిపక్షం బీజేపీ ఆరోపించింది. సదరు టెండర్‌ను తయారీదారులకు కాకుండా సరఫరాదారులకు కేటాయించడం వల్ల స్మార్ట్ మీటర్ల ధరలు భారీగా పెంచారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, సాఫ్ట్‌వేర్ మద్దతునిచ్చే సంస్థ ఇప్పటికే బ్లాక్‌లిస్ట్ అయిన కంపెనీ అని విమర్శలు వచ్చాయి.
కర్ణాటకలో విద్యుత్తు మీటర్ల స్కాంపై Asianet news exclusive story
ఇతర రాష్ట్రాలతో పోల్చితే కర్ణాటకలో స్మార్ట్ మీటర్ ధరలు భారీగా పెరిగాయి. ఏషియానేట్ న్యూస్‌కు లభించిన డాక్యుమెంట్ల ప్రకారం, సింగిల్ ఫేజ్ మీటర్ ధర ₹950 నుంచి ₹4,998కి పెరిగింది. మరో రకమైన సింగిల్ ఫేజ్ మీటర్ ధర ₹2,400 నుంచి ₹9,000కి పెరిగింది. త్రిఫేజ్ మీటర్ ధర అయితే ఏకంగా ₹2,500 నుంచి ₹28,000కి పెరిగింది. గతంలో ఏపీలోనూ ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ లో రూ.ఏడు వేలు మీటరును రూ.36 వేలు విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. గతంలో టీడీపీ నేత.. సోమిరెడ్డి పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇతర రాష్ట్రాలు ఒక్కో స్మార్ట్ మీటర్‌ను రూ.4 వేలకు కొంటుంటే వైసీపీ ప్రభుత్వం రూ.36 వేల కు కొనుగోలు చేసింది ఈ స్మార్ట్ మీటర్ల కొనుగోలులో రూ.17 వేల కోట్ల అక్రమాలు జరిగాయి. ఈ భారాన్ని అప్పటి ప్రభుత్వం కరెంటు బిల్లుల్లో వేసి వసూలు చేయాలని నిర్ణయించింది. పొలాల్లో వ్యవసాయ బావులకు వాడుతున్న మోటార్లకు కూడా స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని, మోటార్లకన్నా మీటర్ల ధర రెట్టింపు ఉందని అన్నారు. ‘రాజస్థాన్‌లో స్మార్ట్ మీటర్ ధర, నిర్వహణ కలిపి రూ.7900 కోట్ చేశారు. ఛండీగఢ్ ప్రభుత్వ కంపెనీ రూ.7100 కోట్ చేసింది. మన రాష్ట్రంలో మాత్రం స్మార్ట్ మీటర్ ధర, నిర్వహణ కలిపి ఏకంగా రూ.36,975కు టెండర్ ఖరారు చేశారు. అని ఆరోపించారు.
బెస్కాం, మెస్కాం, హెస్కాం, జెస్కాం, సెస్కాం కలిసి మొత్తం 8 లక్షల స్మార్ట్ మీటర్ల కోసం ₹7,408 కోట్ల అదనపు వ్యయం అయింది. ఈ భారీ మొత్తాన్ని ఎవరికి లాభంగా మళ్లించారు? ఏ కారణంతో స్మార్ట్ మీటర్ల ధరలు భారీగా పెంచారు? టెండర్‌లో జరిగిన గోల్‌మాల్‌కు ఎవరు బాధ్యత వహించాలి? ఈ ప్రశ్నలు సంధిస్తూ హౌస్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని ప్రతి పక్షం బీజేపీ డిమాండ్ చేస్తోంది.