మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంట్లో దొంగతనం (Former Indian cricketer Yuvraj Singh's house robbed) జరిగింది. నగదు, ఆభరణాలు చోరీకి గురయ్యాయి. దీనిపై యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్ (Shabnam Singh) పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.
మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇంట్లో చోరీ జరిగింది. హరియాణా రాష్ట్రం పంచకులలోని ఎండీసీ సెక్టార్ 4లో ఉన్న ఇంట్లో భారీగా నగదు, ఆభరణాలను ఎత్తుకెళ్లారు. అయితే ఈ చోరీ ఇంటిలో పని చేసే సిబ్బందే చేశారని తెలుస్తోంది. కాగా.. ఈ చోరీ ఇప్పుడు జరిగింది కాదు కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ ఇంట్లో ఉన్న రూ.75 వేల నగదు, వివిధ నగలు 2023 అక్టోబర్ లో చోరీకి గురయ్యాయి.
లెజెండరీ చెఫ్, పద్మ శ్రీ గ్రహీత ఖురేషీ ఇకలేరు.. సోషల్ మీడియాలో నివాళుల వెల్లువ..
undefined
వివరాలు ఇలా ఉన్నాయి. హరియాణాలో పంచకులలోని ఎండీసీ సెక్టార్ 4లో యువరాజ్ కు ఇళ్లు ఉంది. ఆ ఇంట్లో యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్ నివాసం ఉండేది. అయితే 2023 సెప్టెంబర్ నుంచి ఆమె గుర్గావ్ లోని మరో ఇంటికి షిప్ట్ అయ్యారు. నెల రోజులు గడిచిన తరువాత అంటే 2023 అక్టోబర్ లో మళ్లీ ఆమె పాత ఇంటికి తిరిగి వచ్చారు. కానీ ఇంటి మొదటి అంతస్తులోని బీరువాలో ఉన్న సుమారు రూ.75 వేల విలువైన ఆభరణాలు, ఇతర వస్తువులు కనిపించలేదు.
ఈ వ్యవహారంపై ఆమె సొంతంగా విచారణ జరిపినప్పటికీ ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీపావళి పండుగ సమయంలో ఇంట్లో పని చేసే లలితాదేవి, సిల్దార్ పాల్ హఠాత్తుగా ఉద్యోగాన్ని మానేసి వెళ్లిపోయినట్టు వారు గుర్తించారు. దీంతో వారిపై షబ్నమ్ సింగ్ కు అనుమానం వచ్చింది. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. కానీ ఈ విషయాన్ని ఎక్కడా మీడియాకు తెలియనివ్వలేదు. ఒక వేళ మీడియాకు తెలిస్తే దొంగలను పట్టుకోలేమని పోలీసులు, షబ్నమ్ సింగ్ భావించారు.
మరో వారం రోజుల్లో లోక్ సభ ఎన్నికల కోడ్.. స్పష్టం చేసిన కేంద్ర మంత్రి
ఈ కేసు ఇప్పుడు ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మరి యువరాజ్ సింగ్ తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్న ఆ ఇంట్లో పని చేసేవారే ఈ దొంగతనానికి పాల్పడ్డారా ? లేక మరెవరైనా చోరీ చేశారా అనే విషయంలో పోలీసుల దర్యాప్తులో తేలనుంది.
ఇదిలా ఉండగా.. ఇటీవల టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా తన ఇంట్లో దొంగతనం జరిగినట్లు వార్తలు వచ్చాయి. ఫిబ్రవరి 11 శనివారం ఠాకూర్పుకూర్ పోలీస్ స్టేషన్లో గంగూలీ ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన ఫోన్ చోరీకి గురయ్యిందని, అందులో వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.