లెజెండరీ చెఫ్, పద్మ శ్రీ గ్రహీత ఖురేషీ ఇకలేరు.. సోషల్ మీడియాలో నివాళుల వెల్లువ..
భారతదేశ చెఫ్ దిగ్గజం ఇంతియాజ్ ఖురేషీ ఇక లేరు (India's chef legend Imtiaz Qureshi is no more). ఐటీసీ హోటల్స్ లో పని చేసిన ఆయన గొప్ప చెఫ్ గా పేరొందారు. పాక శాస్త్రంలో ఖురేషీ చేసిన కృషికి గాను 2016 లో భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో (India honoured Imtiaz Qureshi with the Padma Shri) సత్కరించింది.
పద్మశ్రీ గ్రహీత, లెజెండరీ చెఫ్ ఇంతియాజ్ ఖురేషీ కన్నుమూశారు. ఐటీసీ హోటల్స్ లో పేరొందిన మాస్టర్ చెఫ్ చెఫ్ ఖురేషీ బుఖారా పాకశాస్త్ర బ్రాండ్ ను రూపొందించారు. దేశంలో మంచి చెఫ్ గా పేరొందిన ఆయన.. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మరణించారు. చనిపోయే సమయానికి ఆయన ఖురేషీ వయస్సు 93 సంవత్సరాలు.
1931లో లక్నోలో చెఫ్ ల కుటుంబంలో జన్మించిన చెఫ్ ఖురేషీ దమ్ పుఖ్త్ కుకింగ్ టెక్నిక్ ను పునరుద్ధరించి ప్రశంసలు అందుకున్నారు. ఇంతియాజ్ ఖురేషీ 1979లో ఐటీసీ హోటల్స్ లో చేరారు. పాక కళకు ఆయన చేసిన కృషికి గాను 2016 లో భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది. ఈ గౌరవాన్ని పొందిన మొదటి చెఫ్ ఖురేషీ నిలిచారు.
కాగా.. ఆయన మరణం పట్ల సోషల్ మీడియాలో నివాళులు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీ చెఫ్ లు కునాల్ కపూర్, రణ్ వీర్ బ్రార్ సంతాప సందేశాలు పోస్ట్ చేశారు.‘‘పద్మశ్రీ చెఫ్ ఇంతియాజ్ ఖురేషీ ఈ రోజు ఉదయం ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారన్న హృదయ విదారక వార్తను తెలియజేయడానికి విచారంగా ఉంది. నా హృదయం బరువెక్కింది. ఆయన పాక వారసత్వం, చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు శాశ్వత శాంతి చేకూరాలని, ఆయన జ్ఞాపకాలు మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉండాలని కోరుకుంటున్నా’’ అని కునాల్ కపూర్ ట్వీట్ చేశారు.
చెఫ్ ఖురేషి త్రోబ్యాక్ ఫోటోను పోస్ట్ చేసిన రణ్వీర్ బ్రార్.. ‘‘చెఫ్ కావాలని కలలు కనే లక్నో కుర్రాడిగా ఉన్న సమయంలో ఇంతియాజ్ ఖురేషి గురించి వింటూ నేను పెరిగాను. 1998-1999 మధ్య ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ లో ట్రైనీ చెఫ్ గా పనిచేశాను. ఆ సమయంలో నేను సంపాదించిన రూ.612/- ను తీసుకొని పక్కనే ఉన్న ఐటీసీ మౌర్యకు వెళ్లి డమ్ పుఖ్త్ వద్ద గలౌటీ కబాబ్ తిన్నాను. ఇది నాకు ఇంకా గుర్తుంది. ఐటీసీ హోటల్లో లెంజెండరీ చెఫ్ ఖురేషీ భోజనం తినడం నా జీవితాన్ని మార్చేసింది. లక్నో నుంచి దమ్ పుఖ్త్ టెక్నిక్ ను బయటకు తీయడమే కాకుండా దానికి ఒక వ్యక్తిత్వాన్ని, తిరుగులేని మెరుగును ఇచ్చాడు. ఓం శాంతి చెఫ్.. మీ వారసత్వం ఎప్పటికీ సజీవంగా ఉంటుంది’’ అని బ్రార్ పేర్కొన్నారు.
పద్మశ్రీ మాస్టర్ చెఫ్ ఇంతియాజ్ ఖురేషీ కన్నుమూశారని తెలిసి చాలా బాధపడ్డానని గాయకుడు అద్నాన్ సమీ అన్నారు. ‘‘ఆయన (ఖురేషీ) పాక మేధావి, జీవితం పట్ల ఉత్సాహం నిండిన వ్యక్తి!! ఆయన అవధి వంటకాలకు ఆధునిక పితామహుడు, అతని బిర్యానీ ప్రపంచానికి తినిపించిన అన్నింటిలో గొప్ప వంటకం.’’ అని పేర్కొన్నారు.