
లోక్ సభ ఎన్నికల కోసం ఇదిగో కోడ్ వస్తుంది.. అదిగో కోడ్ వస్తుందంటూ ప్రతీ రోజూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో 2019 జూన్ 17వ తేదీన కొలువు దీరింది. అంటే ఈ సారి కూడా ఆ తేదీ కంటే ముందుగానే ఎన్నికలు జరిగిపోయి ఫలితాలు కూడా వెలువడాలి. అంటే దానికి రెండు నెలల ముందుగానే ఎన్నికల కసరత్తు పూర్తయిపోవాలి.
లెజెండరీ చెఫ్, పద్మ శ్రీ గ్రహీత ఖురేషీ ఇకలేరు.. సోషల్ మీడియాలో నివాళుల వెల్లువ..
ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్న విషయంలో కేంద్ర మంత్రి కిషర్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఏప్రిల్ మొదటి వారంలో లోక్ సభ కు ఎన్నికలు ఉంటాయని ఆయన తేల్చి చెప్పారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గ నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ మొదటి వారంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి పార్టీ నాయకులు అంతా ఐకమత్యంతో పని చేయాలని సూచించారు.
నూట పది రూపాయిలిచ్చి రోజూ నిలబడి పోవాల్నా..? బస్సులో యువకుడి ఆవేదన.. వైరల్
బీజేపీని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ డెవలప్ మెంట్ లో భారతీయ జనతా పార్టీ పాత్ర చాలా ఉందని తెలిపారు. ఏప్రిల్ మొదటి వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి.. ఈ నెల (ఫిబ్రవరి) చివరి వారం వరకు ఎన్నికల కోడ్ వచ్చే ఛాన్స్ ఉందని తెలిపారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలను బట్టి చూస్తే మరో వారం రోజుల్లో ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంది.