పెళ్లి చేసుకోకపోతే ముక్కలుగా నరికేస్తానని బాలికకు యువకుడి బెదిరింపులు.. అరెస్టు చేసిన పోలీసులు..

By team teluguFirst Published Nov 28, 2022, 1:51 PM IST
Highlights

ఓ బాలికను యువకుడు చాలా కాలంగా వేధిస్తున్నాడు. దీంతో ఆమె తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా అతడు మారకుండా.. తనను పెళ్లి చేసుకోపోతే ముక్కలుగా నరికేస్తానని బాలికను బెదిరించాడు. పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. 

ఢిల్లీలో జరిగిన శ్రద్ధా వాకర్ దారుణ హత్యను దేశం ఇంకా మరిచిపోకముందే.. ఆ తరహా ఉదంతాలు పలు చోట్ల వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో, పశ్చిమబెంగాల్ మహిళలను ముక్కలుగా నరికిన ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినందుకు ఓ బాలికను అలాగే ముక్కలుగా నరికేస్తానని ఓ యువకుడు బెదిరించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. 

అస్సాంలోని యూనివర్సిటీలో ర్యాంగింగ్.. జూనియర్ కు 80 చెంపదెబ్బలు.. రెండో అంతస్తు నుంచి దూకి...

వివరాలు ఇలా ఉన్నాయి.  ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం కాన్పూర్‌లో మహ్మద్ ఫైజ్ అనే యువకుడు 17 ఏళ్ల అమ్మాయిని కొంత కాలంగా వేధిస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని బలవంతం చేస్తున్నాడు. బాలిక పాఠశాలకు వెళ్తే ఆమెను వెంబడించేవాడు. ఈ విషయాన్ని ఆమె తన తల్లిదండ్రలకు తెలిపింది. మొదట్లో ఆ బాలిక తల్లిదండ్రులు ఆ యువకుడి దగ్గరకు వెళ్లి పద్దతి మానుకోవాలని సూచించారు. అయినా అతడు వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. 

ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు.. రాత్రంత ఉక్కిరిబిక్కిరి.. తెల్లవారే సరికి ..

పోలీసులు చెప్పిన తరువాత కూడా నిందితుడు తీరుమార్చుకోలేదు. ఆమెను వెంబడించడం మానుకోలేదు. తనను పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి తీసుకొచ్చాడు. దీంతో బాలిక తాను పెళ్లి చేసుకోబోనని యువకుడికి తేల్చి చెప్పింది. కోపోద్రిక్తుడైన మహ్మద్ ఫైజ్ ‘నన్ను పెళ్లి చేసుకోకపోతే ముక్కలుగా నరికేస్తా’ అని బాలికను బెదిరించాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు సీనియర్ పోలీసు అధికారులను ఆశ్రయించారు. తమ కూతురికి ప్రాణహాని ఉందని ఫైజ్‌పై ఫిర్యాదు చేశారు.

ఢిల్లీలో మళ్లీ కలకలం.. శ్రద్ధా వాకర్‌ను పోలిన హత్య.. తల్లి, కొడుకుల ఘాతుకం

బాధిత కుటుంబ ఫిర్యాదు మేరకు నౌబస్తా పోలీసులు చమన్ గంజ్‌లోని మహ్మద్ ఫైజ్ ఇంటికి చేరుకొని సోదాలు నిర్వహించారు. నిందితుడిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో పోలీసులకు ఫైజ్ కుటుంబం వాగ్వాదానికి దిగింది. దీంతో పోలీసులు బలగాలను అక్కడికి పిలిపించాయి. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో అక్టోబర్ 16న నిందితుడిపై  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నౌబస్తా ఏసీపీ అభిషేక్ కుమార్ పాండే తెలపారని ‘ఇండియా టుడే’ నివేదించింది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన తరువాత మైనర్ బాలికను చంపేస్తానని ఫైజ్ నిరంతరం బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు.
 

click me!