ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు.. రాత్రంత ఉక్కిరిబిక్కిరి.. తెల్లవారే సరికి ..

By Rajesh KarampooriFirst Published Nov 28, 2022, 1:27 PM IST
Highlights

వారణాసిలోని సారనాథ్ ప్రాంతంలో సోమవారం ఉదయం ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. తెల్లవారుజామున ఇళ్ల నుంచి బయటకు వచ్చి చూసేసరికి తలుపుల మధ్యలో ఇరుక్కున్న యువకుడి మృతదేహం కనిపించింది. దొంగతనం చేయాలనే ఉద్దేశంతో లోపలికి ప్రవేశించిన దొంగ తలుపుల మధ్య ఇరుక్కుని మృతి చెందినట్లు చెబుతున్నారు.
 

ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. చోరీకి ప్రయత్నించిన ఓ దొంగ తలుపుల మధ్యలో ఇరుక్కుని మృతి చెందాడు. మిగిలిన శరీరం బయటే ఉండిపోయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.ఈ షాకింగ్ సంఘటన వారణాసిలోని సారనాథ్ ప్రాంతంలోని డానియాల్‌పూర్‌లో జరిగింది. వివారాల్లోకెళ్తే.. సారనాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డానియాల్‌పూర్ ప్రాంతంలో ఉన్న పవర్‌లూమ్ సెంటర్ తలుపులో ఇరుక్కుని ఒక యువకుడు మరణించాడు. 

దొంగతనం చేయాలనే ఉద్దేశంతో పవర్‌లూమ్‌లోకి ప్రవేశిస్తుండగా, దొంగ తల తలుపులో ఇరుక్కుపోయి ఉంటుందని, అందులో నుంచి బయటపడే ప్రయత్నంలో అతడు చనిపోయాడని స్థానికులు చెబుతున్నారు. ఈ వింత ఘటనను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. పవర్లూమ్ నిజాం అనే వ్యక్తికి చెందినది. పని లేకపోవడంతో గత రెండు వారాలుగా ఆ పవర్లూమ్ సెంటర్ మూసివేయబడింది.ఈ క్రమంలో  దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో ఓ దొంగ లోపలికి ప్రవేశించాలని ఆ సెంటర్ తలుపు తీయడానికి ప్రయత్నించాడు. ఈ తరుణంలో ఆ దొంగ తలుపుల మధ్య తల పెట్టడంతో ఇరుక్కుపోయింది. తన తలను బయటకి తీయలేక.. తాను లొపలికి పోలేక నరకయాతన పడ్డాడు. చివరకు పెనుగిసాలాడుతూ.. మరణించాడు.

మృతుడిని పురానా పుల్‌కు చెందిన 30 ఏళ్ల జావేద్‌గా గుర్తించారు. ఇది ఇప్పటికే ఇతర దొంగతనాల ఘటనలలో పాల్గొనట్టు కేసులు నమోదయ్యాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం అనంతరం తన బంధువులకు అప్పగించారు. ఈ మొత్తం వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు.
 
తాజాగా, యూపీలోని బహ్రైచ్‌లో ఓ వింత దొంగతనం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని ఖాసేపూర్ బహరంపూర్ గ్రామానికి చెందిన కున్వర్ పాల్ సింగ్ ఢిల్లీ నుంచి 215 బాక్సుల టూత్ పేస్టును దొంగిలించాడు.ఈ బాక్సుల ఖరీదు రూ.11 లక్షలు. అయితే, ఢిల్లీలోని లాహోరీ గేట్ పోలీస్ స్టేషన్ అధికారులు నిందితుడినిఅరెస్టు చేశారు. అలాగే చోరీకి గురైన సొత్తు మొత్తం స్వాధీనం చేసుకున్నారు. చట్టపరమైన లాంఛనాలన్నీ పూర్తి చేసిన ఢిల్లీ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

click me!