పురాణాల్లో హిందూ పదం లేదు, విదేశీయులు తెచ్చారు: కమల్ హాసన్

By telugu teamFirst Published May 18, 2019, 12:03 PM IST
Highlights

హిందువు అనే పదం దేశీయం కాదని, అది విదేశీయులదని కమల్ హాసన్ అన్నారు. ఆల్వార్లు గానీ నాయనమ్మార్లు గానీ, వైష్ణవులు గానీ శైవులు గానీ హిందు అనే పదం వాడలేదని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన తమిళంలో ఆ వ్యాఖ్యలు చేశారు. 

చెన్నై: సినీ నటుడు, మక్కల్ నీధి మయామ్ అధ్యక్షుడు కమల్ హాసన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పురాణాల్లో హిందువు అనే పదం లేదని ఆయన అన్నారు. దేశంపైకి దండెత్తి వచ్చిన విదేశీయులు ఆ పదాన్ని తీసుకుని వచ్చారని ఆయన అన్నారు. హిందువు అనే కన్నా మనమంతా భారతీయులమని చెప్పుకోవడం అవసరమని అన్నారు. 

హిందువు అనే పదం దేశీయం కాదని, అది విదేశీయులదని కమల్ హాసన్ అన్నారు. ఆల్వార్లు గానీ నాయనమ్మార్లు గానీ, వైష్ణవులు గానీ శైవులు గానీ హిందు అనే పదం వాడలేదని ఆయన అన్నారు. ట్విట్టర్ వేదికగా ఆయన తమిళంలో ఆ వ్యాఖ్యలు చేశారు. 

పౌరులను భారతీయులుగానే పరిగణించారని, దాన్ని మతానికి పరిమితం చేయడం పెద్ద తప్పు అని ఆయన అన్నారు. హిందువు అనే పదాన్ని మొఘలులు వాడారని లేదా విదేశీ పాలకులు వాడారని ఆయన అన్నారు. 

దేశాన్ని పాలించిన బ్రిటిషర్లు దానికి ముందుకు తీసుకుని వెళ్లారని అన్నారు. మనకు విభిన్నమైన అస్తిత్వాలున్నాయని, మనకు స్థానికేతరులు ఇచ్చిన పేరును, విశ్వాసాన్ని కలిగి ఉండడం అజ్ఢానమని అన్నారు. ఇండియన్ అనే అస్తిత్వం కూడా ఇటీవలిదేనని, ఇది శాశ్వతమైందని ఆయన అన్నారు. 

వాణిజ్యం, రాజకీయాలు, ఆధ్మాత్మికపరంగా అది తప్పు అని, విశాలమైన భారతదేశాన్ని మతానికి పరిమితం చేయడం కోసం జరిగిన ప్రయత్నమని కమల్ హాసన్ అన్నారు. అతి మామూలు వ్యక్తి బాషలో చెప్పాలంటే సామరస్యంతో జీవించడం వల్ల కోటి లాభాలు ఉంటాయని ఆయన అన్నారు. 

సంబంధిత వార్తలు

నాథూరామ్‌ గాడ్సేపై వ్యాఖ్యల ఎఫెక్ట్: కమల్‌పై చెప్పుతో దాడి

నాథూరామ్ గాడ్సేపై కమల్ వ్యాఖ్యలు: నాలుక కోయాలన్న మంత్రి రాజేంద్ర

నాథూరామ్ గాడ్సేపై కమల్ వ్యాఖ్యలు: ఈసీకి బీజేపీ ఫిర్యాదు

నాథూరాం గాడ్సేపై కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు

click me!