ప్రియుడితో లేచిపోయిన భార్య.. పెద్ద మనసుతో వారిద్దరికీ వివాహం జరిపించిన భర్త..

By Asianet News  |  First Published Jul 24, 2023, 9:15 AM IST

ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి ఎవరూ చేయలేని పని చేసి వార్తల్లో నిలిచాడు. తన భార్యకు ఆమె ప్రియుడితో కలిసి వివాహం జరిపించాడు. ఆమె భర్తతో ఉండనని, ప్రియడితోనే కలిసి జీవిస్తానని చెప్పడంతో అతడు వారి పెళ్లికి అంగీకరించాడు.


ఆ మహిళకు మూడు సంవత్సరాల కిందట ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే ఆమె కొంత కాలం నుంచి తన దూరపు బంధువుతో సన్నిహితంగా ఉంటోంది. తాజాగా భర్తని విడిచి పెట్టి అతడితో లేచిపోయింది. దీంతో భర్త తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిద్దరిని వెతికిపట్టుకొని తీసుకొచ్చారు. అయితే ఆమె తన ప్రియుడితో కలిసే ఉంటానని అందరి ముందు తెగేసి చెప్పింది. దీంతో అతడు పెద్ద మనసుతో వారిద్దరికీ అక్కడే పెళ్లి చేశాడు.

దళిత బాలికపై గ్యాంగ్ రేప్.. ప్రేమ పేరుతో వల వేసి, లాడ్జికి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం.. మూడు రోజుల తరువాత..

Latest Videos

ఈ విచిత్ర ఘటన ఒడిశాలోని సోన్‌పూర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. సోన్ పూర్ జిల్లాలోని అనుగుల్‌ ప్రాంతానికి చెందిన జిల్లి అనే మహిళకు మూడు సంవత్సరాల కిందట శుభలాయి పోలీసు స్టేషన్ పరిధిలోని కిరాసి గ్రామ నివాసి అయిన మాధవ ప్రధాన్ తో వివాహం జరిగింది. అయితే కొంత కాలం నుంచి జిల్లి భర్తతో కలిసి ఉంటున్నప్పటికీ.. ఆమెకు దూరపు బంధువు అయిన పరమేశ్వర ప్రధాన్ అనే వ్యక్తితో కూడా చనువుగా మెలుగుతోంది.

పోల్ నుంచి తెగి కంచెపై పడ్డ కరెంట్ తీగ.. పొలంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా షాక్ తగిలి కౌలు రైతు మృతి..

ఈ క్రమంలో ఈ నెల 20వ తేదీన గురువారం జిల్లి తన ప్రియుడితో కలిసి ఇంటి నుంచి లేచిపోయింది. దీంతో భర్త మాధవ ప్రధాన్ ఆందోళన చెందాడు. తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించాడు. అతడి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి జిల్లిని, అతడి ప్రియుడి ఆచూకీని గుర్తించారు. వారిద్దరనీ పోలీసు స్టేషన్ కు తీసుకొచ్చారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సొంతింటి నిర్మాణానికి లైన్ క్లియర్.. ఎక్కడ కడుతున్నారంటే ?

అయితే మాధవ ప్రధాన్ భార్య జిల్లి.. తాను భర్తతో జీవించలేనని, ప్రియుడితో పరమేశ్వర్ ప్రధాన్ తో కలిసి ఉంటానని పోలీసు అధికారులకు తేల్చి చెప్పింది. తన ప్రియుడినే పెళ్లి చేసుకొని జీవనం సాగిస్తానని కుండ బద్ధలు కొట్టింది. ఈ విషయం పోలీసులు జిల్లి భర్తకు తెలియజేశారు. దీంతో మాధవ ప్రధాన్ వారి ప్రేమను అర్థం చేసుకున్నాడు. వారి పెళ్లికి అంగీకరించాడు. పెద్ద మనసుతో తన భార్యకు, ప్రియుడితో పోలీసుల సమక్షంలో వివాహం జరిపించాడు.

click me!