ఉత్తరఖాండ్ లో బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్కియారా నుండి దండల్గావ్ ను కలిపేందుకు నిర్మిస్తున్న సొరంగం కుప్పకూలింది. అయితే అందులో సుమారు 36 మంది కార్మికులు చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు రెస్క్యూ సిబ్బంది శ్రమిస్తున్నారు.
tunnel collapses : ఉత్తరాఖండ్ లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగం శనివారం రాత్రి కుప్పకూలింది. అయితే అక్కడ పని చేస్తున్న 36 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. ఈ సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బ్రహ్మఖల్-యమునోత్రి జాతీయ రహదారిపై సిల్కియారా నుండి దండల్గావ్ ను కలిపేందుకు ఈ సొరంగం నిర్మిస్తున్నారు.
Fire in Dal Lake : కాశ్మీర్ లోని దాల్ సరస్సులో అగ్నిప్రమాదం.. ముగ్గురు బంగ్లాదేశీ పర్యాటకులు మృతి
కాగా.. ఈ ఘటనపై సమాచారం అందగానే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అప్రమత్తమయ్యారు. అధికారులతో సంప్రదింపులు జరపడం మొదలుపెట్టారు. ‘‘ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఘటనా స్థలంలో ఉన్నాయి. అందరూ క్షేమంగా తిరిగి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం’’ అని సీఎం పేర్కొన్నారు.
| Uttarakhand: A part of the tunnel under construction from Silkyara to Dandalgaon in Uttarkashi, collapsed. DM and SP of Uttarkashi district are present at the spot. SDRF, and Police Revenue teams are also present at the spot for relief work. Rescue operations underway. pic.twitter.com/hxrGqxWrsO
— ANI UP/Uttarakhand (@ANINewsUP)లోపల చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. రెస్క్యూ సిబ్బంది శిథిలాలను తొలగించేందుకు వర్టికల్ డ్రిల్లింగ్ యంత్రాలను ఏర్పాటు చేసి, ఆక్సిజన్ పైపులను లోపలికి పంపుతున్నారు. అయితే కార్మికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకురావడానికి 2-3 రోజుల సమయం పట్టవచ్చని అధికారులు అంఛనా వేస్తున్నారు.
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఇచ్చే హామీలను నమ్మొద్దు - కర్ణాటక మాజీ సీఎం, జేడీఎస్ నాయకుడు కుమారస్వామి
సొరంగం ప్రారంభ పాయింట్ నుంచి 200 మీటర్లకు ముందుగానే కుప్పకూలిందని ఉత్తరకాశీ ఎస్పీ అర్పన్ యదువంశీ తెలిపారు. రెస్క్యూ యూనిట్ల సమన్వయంతో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతున్నట్లు ఎస్డీఆర్ఎఫ్ కమాండర్ మణికాంత్ మిశ్రా చెప్పారు. కార్మికులంతా సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు.