పఠాన్ సినిమాపై బజరంగ్ దళ్, వీహెచ్ పీ ఆగ్రహం.. అహ్మదాబాద్ లో కార్యకర్తల ఆందోళనలు, పోస్టర్లు చించివేత

By team teluguFirst Published Jan 5, 2023, 2:02 PM IST
Highlights

పఠాన్ సినిమాను విడుదల చేయకూడదని గుజరాత్ లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సంస్థలకు చెందిన కార్యకర్తలు ర్యాలీగా బయల్దేరి ఓ మాల్ కు చేరుకొని, నినాదాలు చేస్తూ ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్లు చింపేశారు. 

బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనే నటించిన పఠాన్ సినిమాపై వివాదం కొనసాగుతోంది. ఈ సినిమా నిర్మాతలు విడుదల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా ప్రముఖ మితవాద సంస్థలైన విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ సభ్యులు ఆందోళనలు చేయడం ప్రారంభించారు. అహ్మదాబాద్‌లోని వస్త్రాపూర్ మాల్‌లో వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ కార్యకర్తలు ‘పఠాన్’విడుదలకు వ్యతిరేకంగా బుధవారం నిరసన తెలిపారు. రెండు గ్రూపులకు చెందిన సభ్యులు భారీ ర్యాలీగా వెళ్లి, మాల్ లో ఉన్న సినిమా పోస్టర్లు, ఇతర ప్రచార సామగ్రిని చించివేశారు.

మత్తు ఇంజెక్షన్‌ తీసుకుని మహిళా డాక్టర్ ఆత్మహత్య.. టెన్షన్ తట్టుకోలేకే అంటూ..

దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ సినిమాపై కోపంగా ఉన్న కార్యకర్తలు  షారూఖ్ ఖాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వచ్చారు. మాల్ లోపలికి వెళ్లి ఆగ్రహంతో పోస్టర్లను చింపివేస్తూ “జై శ్రీరాం” అని నినదించారు. అలాగే ఆ సినిమా ప్రమోషన్ కోసం ఉంచిన అన్ని వస్తువులను ధ్వంసం చేశారు. 

‘యూపీ పరిస్థితుల్లో మార్పు వచ్చిందా?’ రాహుల్ యాత్రకు రామ మందిర ప్రధాన అర్చకుడు, సెక్రెటరీ మద్దతుపై జైరాం రమేశ్

ఈ సందర్బంగా విశ్వ హిందూ పరిషత్ గుజరాత్ అధికార ప్రతినిధి హితేంద్రసింగ్ రాజ్‌పుత్ మాట్లాడుతూ.. ‘‘గుజరాత్‌లో పఠాన్ ప్రదర్శనను అనుమతించరు. ఈరోజు అహ్మదాబాద్‌లో సినిమా విడుదలకు వ్యతిరేకంగా జరిగిన నిరసన రాష్ట్రంలోని థియేటర్ యజమానులందరికీ మేల్కొలుపులా ఉండాలి. వారి థియేటర్లు లేదా మల్టీప్లెక్స్‌లలో సినిమాను విడుదల చేయకూడదు ’’ అని తెలిపారు.

| Gujarat | Bajrang Dal workers protest against the promotion of Shah Rukh Khan's movie 'Pathaan' at a mall in the Karnavati area of Ahmedabad (04.01)

(Video source: Bajrang Dal Gujarat's Twitter handle) pic.twitter.com/NelX45R9h7

— ANI (@ANI)

ఈ ఆందోళనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఐదుగురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు వస్త్రాపూర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ జేకే దంగర్ తెలిపారు. అనంతరం వారిని విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నట్లు వార్తా సంస్థ ‘పీటీఐ’నివేదించింది.

Ahmedabad: Bajrang Dal Protest against Movie Raising the Slogans

"Bhagwa Ke Samman me Bajrang Dal Maidan me"

"Neem ka Patta Kadawa hai **** Hai"

vandalized the theater while raising slogans pic.twitter.com/OVGd9yg2R2

— Amit Sahu (@amitsahujourno)

ఏమిటీ వివాదం.. ?
జనవరి 25న విడుదల కానున్న ఈ సినిమాను బ్యాన్ చేయాలని హిందూ సంస్థలు గత కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ సినిమాలో ఉన్న ‘బేషరమ్ సాంగ్’లోని కొంత భాగాన్ని ప్రమోషన్ కోసం గత నెలలోనే చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే ఇందులో షారూఖ్ ఖాన్ తో కలిసి దీపికా పదుకొణె డ్యాన్స్ చేసింది. ఆమె కాషాయ రంగుల్లో ఉన్న బికినీ ధరించడమే ఈ వివాదానికి కారణమైంది. దీంతో అప్పటి నుంచి ఈ సినిమా విడుదల చేయకూడదని రైట్ వింగ్ సంస్థలు కోరుతున్నాయి. అయితే గుజరాత్ లో కూడా ఈ సినిమా ఎక్కడా ప్రదర్శించకూడదని వీహెచ్ పీ గతంలోనే సూచించింది.

click me!