ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లి, కొశ్చన్ పేపర్ చూసి.. బిల్డింగ్ పై నుంచి దూకేసిన స్టూడెంట్

By Sairam Indur  |  First Published Feb 18, 2024, 9:22 AM IST

కర్ణాటక (Karnataka)లోని ఉడిపి (udipi)జిల్లాలో దారుణం జరిగింది. పరీక్ష రాసేందుకు సెంటర్ కు వెళ్లిన విద్యార్థి.. కొంత సమయానికే గదిలో నుంచి బయటకు వచ్చి బిల్డింగ్ పై నుంచి దూకేశాడు. (student jumped out of the examination centre and jumped on the building.) దీంతో ఆ విద్యార్థి తీవ్ర గాయాలతో మరణించాడు.


అది కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా. మణిపాల్ సిటీలోని ఓ కాలేజీలో బీటెక్ పరీక్షలు జరుగుతున్నాయి. ఎప్పటిలాగే ఓ స్టూడెంట్ ఆ సెంటర్ లోకి వచ్చారు. తనకు కేటాయించిన స్థానంలో వెళ్లి కూర్చున్నాడు. పరీక్ష టైమ్ స్టార్ కాగానే ఇన్విజిలేటర్ కొశ్చన్ పేపర్ తీసుకొచ్చి ఆ స్టూడెంట్ కు ఇచ్చారు. ఇక అంతే.. ఆ కొశ్చన్ పేపర్ చూసిన ఆ అబ్బాయికి ఏమయ్యిందో ఏమో తెలియదు. వెంటనే టెన్షన్ పడ్డాడు. నేరుగా ఆ కాలేజీ బిల్డింగ్ పైకి ఎక్కడి దూకేశాడు. దీంతో ఆ స్టూడెంట్ తీవ్రగాయాలతో చనిపోయాడు.

అయోధ్య రాములోరికి తిరుమల వెంకన్న సాయం..

Latest Videos

సినిమా సీన్ ను తలపించే ఈ ఘటన నిజంగానే జరిగింది. మృతి చెందిన విద్యార్థిని బీహార్ కు చెందిన సత్యం సుమన్ (19)గా పోలీసులు గుర్తించారు. సుమన్ మహే యూనివర్సిటీలోని ఎంసీహెచ్ పీ విభాగంలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రస్తుతం బీటెక్ పరీక్షలు జరుగుతున్నాయి. మణిపాల్ సిటీలోని ఓ కాలేజీలో ఆ స్టూడెంట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంది. 

ఒకే ఎన్‌క్లోజర్‌లోకి అక్బర్, సీతా పేరున్న మగ, ఆడ సింహం.. కోర్టును ఆశ్రయించిన వీహెచ్ పీ

దీంతో శనివారం సుమన్ ఎగ్జామ్ సెంటర్ కు చేరుకున్నారు. తరువాత తనకు కేటాయించిన గదిలోకి వెళ్లాడు. అప్పటికే టెన్షన్ పడుతున్న అతడు తన స్థానంలో కూర్చున్నాడు. కొంత సమయానికి ఇన్విజిలేటర్ ప్రశ్నాపత్నం తీసుకొని ఇచ్చాడు. దానిని చూసిన సుమన్ ఫేస్ మొత్తం మారిపోయింది. వెంటనే ఆ గది నుంచి బయటకు వచ్చి బిల్డింగ్ పై నుంచి దూకాడు.

మేడారం జాతరకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..

తీవ్ర గాయాలు కావడంతో ఆ స్టూడెంట్ మరణించాడు. దీనిపై మణిపాల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. అయితే సుమన్ ఇలా బిల్డింగ్ పై నుంచి దూకడానికి గల కచ్చితమైన కారణం ఏంటో ఇంకా పోలీసులకు కూడా తెలియరాలేదు. బాధిత విద్యార్థి పరీక్ష భయంతో సతమతమయ్యాడా ? లేక మరేదైనా సమస్యతో సతమతమయ్యాడా అనేది అనేది ఇంకా స్పష్టం కాలేదని, దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు వెల్లడించారు. 

జీవితంలోని ప్రతి సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం కాదు. జీవితంలో మీకెప్పుడైనా మానసిక ఒత్తిడితో బాధపడుతూ సహాయం కావాలనిపిస్తే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726 )  కి కాల్ చేయండి లేదా ప్రభుత్వ హెల్ప్ లైన్ కి కాల్ చేయండి. జీవితం చాలా విలువైనది.
 

click me!