
భారతదేశంతో పాటు ప్రపంచంలోని హిందువులంతా ఎదురుచూసిన అయోధ్య రామ మందిర నిర్మాణ కల సాకారమైంది. ఈ ఆలయం జనవరి 22వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఆ బాల రాముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆరోజు దేశమంతా మరో సారి దీపావళి పండగ జరపుకుంది. దేవాలయాలన్నీ భక్తులతో నిండిపోయాయి.
ఒకే ఎన్‌క్లోజర్‌లోకి అక్బర్, సీతా పేరున్న మగ, ఆడ సింహం.. కోర్టును ఆశ్రయించిన వీహెచ్ పీ
మరుసటి రోజు నుంచి సాధారణ భక్తులకు ఆ అయోధ్య బాల రాముడి దర్శనం కల్పిస్తున్నారు. దీంతో భక్తులు అధిక సంఖ్యలో ఆ ఆధ్యాత్మిక నగరానికి తరలివస్తున్నారు. అయితే ఎత్తున వస్తున్న భక్తులకు క్యూ మేనేజ్ మెంట్ నిర్వహణ, ఇతర సౌకర్యాల ఏర్పాటులో సాంకేతిక సాయం అందించాలని, భక్తుల రద్దీ క్రమబద్దీకరణ, ఇతర పలు అంశాలపై అవగాహన కల్పించాలని అయోధ్య రామమందిర ట్రస్ట్ మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కోరింది.
Jnanpith Award: జగద్గురు రామభద్రాచార్య, సినీ కవి గుల్జార్‌కు జ్ఞానపీఠ్ అవార్డు
దీంతో శనివారం సాయంత్రం కాన్ఫరెన్స్ హాల్ లో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు భక్తుల రాక నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణపై అవగాహన కల్పించారు. భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ, క్యూలైన్ నిర్వహణ వ్యవస్థ తదితరాలపై వివరాలు అందించారు.
సీమా హైదర్ కేసులో మళ్లీ ట్విస్ట్.. ఏం జరిగిందంటే ?
కాగా.. ట్రస్టు ఆహ్వానం మేరకు టీటీడీ అధికారులు శనివారం అయోధ్యకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాలరాముని ఆలయానికి వచ్చే భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవోను అడిగి తెలుసుకున్నారు. క్యూ లైన్ల నిర్వహణకు సంబంధించి టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు పలు సూచనలు చేశారు. అనంతరం టీటీడీ అధికారులు బలరాముడి దర్శనం చేసుకొని నైవేద్యాలు సమర్పించారు