నాడు ప్ర‌ధాని మోడీ టీ అమ్మిన వాద్ నగర్.. నేడు ‘ఆదర్శ్ రైల్వే స్టేషన్’గా ప్ర‌క‌ట‌న..

Published : Sep 01, 2022, 09:03 AM IST
నాడు ప్ర‌ధాని మోడీ టీ అమ్మిన వాద్ నగర్.. నేడు ‘ఆదర్శ్ రైల్వే స్టేషన్’గా ప్ర‌క‌ట‌న..

సారాంశం

గతంలో ప్రధాని మోడీ తన టీ అమ్మిన రైల్వే స్టేషన్ ను ఆదర్శ రైల్వే స్టేషన్ గా ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఈ స్టేషన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన చిన్నతనంలో తండ్రితో కలిసి టీ అమ్మిన వాద్ నగర్ రైల్వే స్టేషన్ ముఖ‌క‌వ‌ళిక‌లు ఇప్పుడు పూర్తిగా మారిపోయాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెల‌ల ముందు ఈ రైల్వే స్టేష‌న్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందింది. ఈ రైల్వే స్టేషన్ లో గతంలో మీటర్ గేజ్ రైలు మార్గం ఉండేది. ఇది ఇప్పుడు పశ్చిమ రైల్వే పరిధిలోని 55 కిలోమీటర్ల పొడవైన మెహ్సానా-వరేథా రైలు విభాగంలో బ్రాడ్ గేజ్ రైలు మార్గంగా మార్చబడింది.

నాలుగు పెళ్లిళ్లు, ఏడుగురు సంతానం.. రహస్యంగా ఐదో పెళ్లికి సిద్దం.. తండ్రిని చితకబాదిన రెండో భార్య, పిల్లలు....

అభివృద్ధి చెందిన ఈ రైల్వే స్టేష‌న్ రూపాన్ని ‘న్యూ ఇండియా, న్యూ రైల్వే స్టేషన్’ గా అభివర్ణిస్తూ ఇటీవ‌లే రైల్వే మంత్రిత్వ శాఖ పాత,  కొత్త ఫొటోల‌ను షేర్ చేసుకుంది. ‘నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఈ రైల్వే స్టేష‌న్ ఫేమ‌స్ అయ్యింది. ఈ స్టేషన్ గుండా వెళ్లే ప్రయాణీకులు తమ కంపార్ట్మెంట్ నుండి బయటకు వస్తారు. ఇది ప్ర‌ధాని మోడీ టీ అమ్మిన స్టేష‌న్ అని పిలుస్తూ సెల్ఫీలు తీసుకుంటారు’’ అని స్థానికులు తెలిపారు. 

2021లో మెహసానా జిల్లాలోని గాంధీనగర్, వరేథా రైల్వే స్టేషన్ మధ్య నడిచే మెమూ ప్యాసింజర్ రైళ్లను ప్రధాని మోదీ వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించారు. ఈ విభాగాన్ని వాణిజ్యపరంగా మరింత ఆచరణీయంగా చేయడానికి, రైల్వే ప్యాసింజర్, గూడ్స్ ట్రాన్స్ పోర్ట్ రైళ్లు రెండింటినీ క్రమం తప్పకుండా నడపడం ప్రారంభించింది. ఈ రైల్వే స్టేషన్ కు రైల్వే ఒక పెద్ద ఫేస్ లిఫ్ట్ ఇచ్చింది, గుజరాత్ పర్యాటక శాఖ రైల్వే స్టేషన్ లో ఒకప్పుడు భారత ప్రధాని ఇక్కడ టీ అమ్మిన జ్ఞాపకార్థంగా ఒక పెద్ద టీ-కెటిల్ ను ఏర్పాటు చేసింది.

కన్నకూతురిపై అత్యాచారం, బిడ్డకు జన్మనిచ్చిన బాలిక.. శిశువును కాలువలోకి విసిరేస్తూ పట్టుబడ్డ తండ్రి...

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, గుజరాత్ పర్యాటక శాఖ సంయుక్తంగా వాద్ నగర్- -మొధేరా-పటాన్ హెరిటేజ్ సర్క్యూట్ ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించాయని, ఈ స్టేషన్ లో హెరిటేజ్ పార్కును అభివృద్ధి చేయడానికి పనులు జరుగుతున్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి.

పోర్ట్‌ఫోలియో మార్పు తర్వాత కొన్ని గంటలకు బీహార్ మంత్రి కార్తికేయ సింగ్ రాజీనామా..

పురావస్తు శాఖ తవ్వకాల తరువాత క్రీస్తు శకం 2, 4 వ తేదీల నాటి బౌద్ధ మఠం ఈ ప్రాంతాలలో ఉనికిలో ఉందని కనుగొన్నారు. దీంతో వాద్ నగర్ నగరం ప్రాంతం హిస్టారికల్ కు కూడా ప్రసిద్ధి చెంది ఉంది. పశ్చిమ రైల్వేల ప్రధాన ప్రతినిధి సుమిత్ ఠాకూర్ మాట్లాడుతూ.. వాద్ నగర్ రైల్వే స్టేషన్ ను మునుపటి కంటే మరింత అందంగా, సౌకర్యవంతంగా తిరిగి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ‘‘ ఇది అత్యాధునిక సౌందర్య స్టేషన్ భవనం. ఇక్క‌డ ప్రొఫెష‌న‌ ల్ గా నిర్మించిన ఎంట్ర‌న్స్, ఎగ్జిట్ దారుల‌ను క‌లిగి ఉంది. అని ఠాకూర్ చెప్పారు. 
 

PREV
click me!

Recommended Stories

భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu
PM Modi Visit Ethiopia: మోదీ కి గుర్రాలపై వచ్చి స్వాగతం స్వయంగా కారునడిపిన పీఎం| Asianet News Telugu