
జార్ఖండ్ లో దారుణం జరిగింది. చేతబడి చేసిందనే అనుమానంతో ఓ వృద్ధురాలి గ్రామస్తులు కొట్టి చంపారు. ఈ ఘటన గుమ్లా జిల్లాలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. మరి కొందరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
గంటల తరబడి నిరీక్షించినా స్టాప్ లో ఆగడం లేదని.. బస్సు కిటికీని రాయితో పగులగొట్టిన మహిళ..
వివరాలు ఇలా ఉన్నాయి. గుమ్లా జిల్లాలోని నగర్-చాద్రీ గ్రామంలో 58 ఏళ్ల సలో దేవి తన కుటుంబంతో కలిసి గ్రామంలో నివసిస్తోంది. అయితే ఇటీవల ఆ గ్రామంలో ఏడాదిన్నర బాలిక అస్వస్థతకు గురైంది. దీంతో సలో దేవి చేతబడి చేసిందని, అందుకే పాపకు ఇలా జరిగిందని గ్రామస్తులు అనుమానం పెంచుకున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 10.30 గంటల ఆ వృద్ధురాలు నివసించే ఇంటికి చేరుకున్నారు. సుమారు 8-10 మంది వెళ్లి ఆ ఇంటి తలుపు కొట్టారు. ఆ సమయంలో ఆ కుటుంబ సభ్యులందరూ భోజనం చేస్తున్నారు.
కొందరు వ్యక్తులు సలో దేవి కుమారుడిని మద్యం తాగించేందుకు బయటకు తీసుకొచ్చారు. అనంతరం ఆ వృద్ధురాలిని ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్లారు. వెదురు కర్రలు, బూట్లతో దాడి చేశారు. దీంతో ఆమె తీవ్రంగా గాయపడింది. ఈ దాడిని ఆపేందుకు సలో దేవి భర్త అహ్లాద్ లోహ్రా, సోదరి సబితా కుమారి, మరదలు లక్ష్మీ కుమారి ప్రయత్నించారు. దీంతో వారిని కూడా గ్రామస్తులు కొట్టారని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నివేదించింది.
అంతకు గంట ముందు అంటే దాదాపు 9 గంటల ప్రాంతంలో అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారి తల్లి సలోదేవి వద్దకు వచ్చింది. మంత్రవిద్యను ఆచరిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమెను హెచ్చరించింది. అయితే ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు అక్కడికి చేరుకున్నారు. గాయాలపాలైన ఆమెను రక్షించి సమీపంలోని సిసాయిలోని రిఫరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ పరిస్థితి విషమించి మరణించింది.
16 ఏళ్ల బాలికకు లైంగిక సంపర్కంపై నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఉంటుంది - మేఘాలయ హైకోర్టు
గ్రామంలో ఓ చిన్నారి అస్వస్థతకు గురైందని, అయితే ఆమె మాంత్రికురాలు అనే అనుమానంతో హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. 10 మంది పేర్లతో పాటు పలువురు గుర్తుతెలియని వ్యక్తులపై సిసాయ్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పటి వరకు తొమ్మిది మందిని అరెస్టు చేశామని, మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని గుమ్లా ఎస్పీ ఎహ్తేషామ్ వక్వరీబ్ తెలిపారు.