బీజేపీ ఎన్ని ఎక్కువ స్థానాలు గెలిస్తే.. ప్రతిపక్షాలకు అంతగా టార్గెట్ అవుతుంది - ప్రధాని మోడీ

By Asianet NewsFirst Published Mar 28, 2023, 3:36 PM IST
Highlights

ఎన్నికల్లో బీజేపీ ఎన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తే.. అంతే స్థాయిలో ప్రతిపక్షాల నుంచి నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ విషయాన్ని తాను గుజరాత్ ఎన్నికల సమయంలోనే ప్రస్తావించానని చెప్పారు. రాజకీయ నాయకులు రాజకీయేతర ప్రయోజనాల కోసం పని చేయాలని కోరారు. 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం తన ప్రభుత్వంపై విపక్షాల దాడిని బీజేపీ బలమైన ఎన్నికల పనితీరుతో ముడిపెట్టారు. అధికార పక్షం ఎంత ఎక్కువ విజయాలు సాధిస్తే.. అంతగా ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతుందని ఆయన నొక్కి చెప్పారు. ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతికి మధ్య కాలాన్ని సామాజిక న్యాయం కోసం కేటాయించాలని ఎంపీలను కోరారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాలను కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మీడియాతో వెల్లడించారు.

ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌లపై పరువునష్టం.. నోటీసులు పంపిన ఢిల్లీ హైకోర్టు

ప్రభుత్వ తొమ్మిదో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మే 15 నుంచి నెల రోజుల పాటు ఆయా నియోజకవర్గాల్లో వివిధ ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని మోడీ పార్టీ ఎంపీలను కోరారు. భూమాత కోసం అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. తనను విషపూరితం చేసే రసాయనాల నుంచి విముక్తి కల్పించాలని భూమాత ఏడుస్తోందని అన్నారు. 

రాజకీయ నాయకులు రాజకీయేతర ప్రయోజనాల కోసం పనిచేయాలని, అలాగే వారు సమాజంపై చాలా ప్రభావాన్ని చూపుతారని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 'బేటీ బచావో' (ఆడబిడ్డలను కాపాడండి) కోసం గుజరాత్ ప్రభుత్వం చేసిన కృషిని ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి నిపుణుల సేవలను ఉపయోగించుకోవాలని ఎంపీలను కోరారు. ప్రతిపక్షాల నిరంతర నిరసనలను ప్రస్తావిస్తూ.. బీజేపీ మరిన్ని ఎన్నికలలో విజయం సాధిస్తున్న కొద్దీ ఇలాంటి ఆందోళనలు మరింత తీవ్రమవుతాయని గుజరాత్ ఎన్నికల సమయంలో తాను చెప్పానని మోడీ గుర్తు చేశారు. పార్టీ మరింత తీవ్రమైన, దిగువ స్థాయి దాడులను ఎదుర్కొంటుందని ఆయన పేర్కొన్నారు.

సద్గురు జగ్గీ వాసుదేవ్ ను వాటర్ ఛాంపియన్ అవార్డు తో స‌త్క‌రించిన టెరి

ఇటీవల జరిగిన మూడు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత త్రిపురలో పార్టీ అధికారాన్ని నిలుపుకోగలిగిన తర్వాత జరిగిన తొలి బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఇదే కావడం గమనార్హం. నాగాలాండ్ ఎన్నికల్లోనూ దాని కూటమి విజయం సాధించగా, మేఘాలయలో ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడానికి ఆ పార్టీ మళ్లీ ఎన్పీపీతో చేతులు కలిపింది. కాగా.. పార్టీ సాధించిన ఘనతకు మోడీని ఈ సమావేశంలో ప్రశంసించారు.

ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు.. అతిక్ అహ్మద్ ను దోషిగా తేల్చిన స్పెషల్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు

ఇదిలా ఉండగా.. అదానీ వ్యవహారంపై జేపీసీ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విపక్షాల నిరసనలు కొనసాగడంతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రద్దయ్యాయి. పరువునష్టం కేసులో సూరత్ కోర్టు దోషిగా తేల్చడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించడంతో వారి నిరసనలు తీవ్రమయ్యాయి. ఇటీవల బ్రిటన్ పర్యటనలో భారత ప్రజాస్వామ్యాన్ని అవమానించినందుకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎంపీలు కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసన వ్యక్తం చేశారు. 
 

click me!