MODI 370 Seats Target: దేశంలో బీజేపీ ముచ్చటగా మూడవసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది. అందుకు తగ్గ ప్రణాళికలు రచిస్తూ ముందుకు సాగుతోంది. నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీకి ప్రతిపక్ష కూటమి బలహీనంగా ఉండడంతో మరోసారి కమలం పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తోందంటూ ఇప్పటికీ ఎన్నో సర్వే సంస్థలు వెల్లడించాయి. అయితే.. ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 సీట్లు గెలుచుకుంటుందని ధీమాగా ఉంది. కానీ, ఈ 400 సీట్ల లక్ష్యంలో బీజేపీనే ఒంటరిగానే 370 సీట్లను సాధించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది.. అయితే.. 370 సీట్లు సాధించడం వెనుక.. బీజేపీ బడా ప్లాన్ ఉందని పలువురు విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఇంతకీ 370 స్థానాల్లో గెలువాలనే లక్ష్యం వెనుక అసలు రహస్యమేంటీ? మరోసారి బీజేపీ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వస్తే.. ఏం చేయాలనుకుంటుందనే అంశాలపై ప్రత్యేక కథనం
MODI 370 Seats Target: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి మూడోసారి అధికారంలోకి రావాలని కలలు కంటున్నారు నరేంద్రమోడీ. ఈ సారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే.. వికాసిత్ భారత్ పేరుతో తాము అమలు చేసే కార్యక్రమాలను మమూలుగా ఉండబోవని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయినా.. రెండు పర్యయాలు అధికారాలోకి వచ్చిన బీజేపీ చేయాలనుకున్నా పనులను ఎందుకు చేయలేకపోయింది. 370 సీట్లు వస్తే ఏ మార్పులు చేయబోతుంది. బీజేపీ అంతర్యమేంటీ? అలాగే.. బీజేపీ అధికారంలోకి వస్తే.. దేశంలో ఎలాంటి మార్పులు తీసుకురాబోతుందనే ప్రధాన ప్రశ్న.
బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే.. దేశంలో ప్రధానంగా 5 మార్పులు తీసుకరావాలని, అందులో కొన్ని విషయాల అమలుకు రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుందట. వాస్తవానికి భారత రాజ్యాంగం ధృడ, అధృడ అంశాల కలయిక. కాబట్టి.. కొన్ని విషయాలను సవరించాలంటే.. సాధారణ మెజారిటీ మూడింట ఒక వంతు, మరికొన్ని విషయాలను మార్చాలంటే.. ప్రత్యేక మెజారిటీ. అంటే.. మూడింట రెండు వంతు మెజారిటీ అవసరం. కొన్ని ప్రత్యేక సందర్బాల్లో సగం కంటే.. ఎక్కువ రాష్ట్రాల ఆమోదం అవసరం. కాగా బీజేపీ అధికారంలోకి వస్తే.. ప్రత్యేక మెజారిటీ సాధించడంతో పాటు సగం కంటే ఎక్కవ రాష్టాల్లో అధికారం కావాలని ఆరాటపడుతోందట.
370 సీట్లు అందుకోసమేనా..
370 సీట్లు అనేది ప్రత్యేక మెజారిటీ. భారత రాజ్యాంగం ఆర్టికల్ 368 ప్రకారం.. రాజ్యాంగంలోని కొన్ని కీలక అంశాలపై సవరణలు చేయాలంటే.. లోక్ సభలోని సగం కంటే ఎక్కువ సభ్యులు హాజరు కావడంతో పాటు.. హాజరైన సభ్యుల్లో మూడింట రెండో వంతు మంది ఆ తీర్మానాలకు ఆమోదించాలని, అంటే.. మొత్తం ఓటు 272 కంటే ఎక్కువగా ఉండాలి.
ఒక వేళ ఆ తీర్మాన సభకు మొత్తం 545 మంది సభ్యులు హాజరైతే.. మూడవ వంతు 363 లేదా అంతకంటే ఎక్కువ మంది మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. కీలక సమయాల్లో ప్రతిపక్షాలని ఏకమైనా.. బీజేపీ ఒక్కటే.. ఆ నిర్థిష్ట బిల్లును పాస్ చేయాలని భావిస్తోంది. ఇలా ఆ పార్టీకి రాజ్యాంగంలో ఏదైనా ఆర్టికల్ సైతం తొలగించి సవరించి మార్చే హక్కు ఉంటుందట.
అదే సమయంలో ఎక్కువ రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. కొన్ని ప్రత్యేక బిల్లు విషయంలో పార్లమెంట్ లో ప్రత్యేక మెజారిటీతో ఆమోదించడమే కాదు. కొన్ని సందర్బాల్లో సగం కంటే ఎక్కువ రాష్ట్రాల ఆమోదం కూడా అవసరం. జీఎస్టీ బిల్లు ఆమోద విషయంలో ఇలాంటి సందర్బమే వచ్చింది. అందుకే ఈ సారి బీజీపీ స్పెషల్ టార్గెట్ 370. ఈ నినాదంతో ముందుకు వెళ్తోందని పలువురు భావిస్తున్నారు.
ప్రత్యేక మెజార్టీతో మార్చు చేసిన అంశాలు..
ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చినా మోడీ సర్కార్ ఏడు సార్లు రాజ్యాంగ సవరణ చేసింది. ఇందులో భూసరిహద్దు చట్టంలో మార్పు, జీఎస్టీ బిల్లు అమలు, బీసీ కమిషన్ ఏర్పాటు, ఈడబ్యూసీ రిజర్వేషన్లు, ఆంగ్లో ఇండియన్ రిజర్వేషన్ తొలగింపు, 370 ఆర్టికల్ రద్దు, చట్ట సభల్లో మహిళలు ఆమోదం వంటి బిల్లు ఆమోదం కోసం రాజ్యాంగ సవరణ చేయాల్సి వచ్చింది. ఇందులో దాదాపు అన్ని సాధారణ,అవివాదాస్పద అంశాలే కావడంతో ప్రతిపక్షాల నుంచి కూడా ఆమోదం లభించింది. అలాగే.. బీజేపీకి ఎక్కడ కూడా వ్యతిరేకత రాలేదు. కానీ, రానున్న కాలంలో అలాంటి పరిస్థితులే ఉంటాయంటే.. కష్టమే.. ప్రతిపక్షాలు బీజేపీ విధానాలను తిరస్కరించవచ్చు. కమలం పార్టీ మద్దతు ఇవ్వకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా బీజేపీ అనుకున్నా బిల్లులను ఆమోదించుకోవాలంటే.. ఈ ప్రత్యేక మెజార్టీ అవసరం.
బీజేపీ మార్చబోయే అంశాలివేనా..?
దేశంలో బీజేపీ అధికారంలో వచ్చే తొలుత ఆర్టికల్ 370 రద్దు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, ఉమ్మడి పౌర స్మ్రుతి బిల్లు అమలు చేయాలని భావించింది. అయితే.. అందులో మొదటి రెండు అంశాలను విజయవంతంగా అమలు చేసింది. ఇప్పుడు మిగిలింది ఉమ్మడి పౌర స్మ్రుతి . ఈ అంశం అమలులోకి రావాలంటే.. ప్రత్యేక మెజార్టీ అవసరం. అంతేకాకుండా.. జమిలి ఎన్నికలు అమలు, రాజ్యాంగంలో కొన్ని అంశాల మార్పు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు , ఎన్నికల సంస్కరణలు వంటి అంశాలను అమలులోకి తీసుకరావాలని భావిస్తుందని రాజకీయ విశ్లేషకలు భావిస్తున్నారు. పై అంశాలను అమలులోకి తీసుకరావాలంటే.. రాజ్యాంగ సవరణ అవసరం. ఈ మేరకే బీజేపీ 370 లక్ష్యంగా అడుగులేస్తుంది.