బెళగావి లోక్‌సభ ఎన్నికల ఫలితాలు 2024

By Siva Kodati  |  First Published Apr 4, 2024, 8:35 PM IST

రాష్ట్ర రాజధాని బెంగళూరు తర్వాత బెళగావికి ప్రాధాన్యత వుంది. బెళగావి లోక్‌సభ నియోజకవర్గం కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కేంద్రమంత్రులుగా పనిచేసన బాబాగౌడ పాటిల్, సురేష్ అనగాడిలు బెళగావి నుంచి ప్రాతినిథ్యం వహించారు. బెళగావి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అరభావి, గోకక్, బెళగావి ఉత్తర్, బెళగావి దక్షిణ్, బెళగావి రూరల్, బెయిల్‌హోంగల్, సౌండట్టి ఎల్లమ్మ, రాందుర్గ్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి.  వీరశైవ లింగాయత్, మరాఠాలు ఇక్కడ బలమైన శక్తులుగా వున్నారు. బెళగావిలో కాంగ్రెస్ పార్టీ 11 సార్లు, బీజేపీ 6 సార్లు, జనతాదళ్ ఒకసారి విజయం సాధించాయి.  కిత్తూరు కర్ణాటక ప్రాంతంలో కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్‌ను బీజేపీ తన అభ్యర్ధిగా బరిలో దించింది. తన అభ్యర్ధిగా మృణాల్ రవీంద్ర హెబ్బాల్కర్‌ను కాంగ్రెస్ ప్రకటించింది.


బెళగావి.. వాయువ్య కర్ణాటకలో అత్యంత కీలక నగరం. రాణి కిత్తూరు చెన్నమ్మ ఉద్యమాన్ని నడిపిన ప్రాంతం కావడంతో ఈ ఏరియాకు కిత్తూరు కర్ణాటకగా నామకరణం చేశారు. ఈ ప్రాంతంలోని ఏడు జిల్లాలలో బెళగావి అత్యంత కీలకం. రాష్ట్ర రాజధాని బెంగళూరు తర్వాత బెళగావికి ప్రాధాన్యత వుంది. బెళగావి పట్టు, చేనేత, చక్కర సహకార సంఘాలకు కేంద్రం. బెళగావి లోక్‌సభ నియోజకవర్గం కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. కేంద్రమంత్రులుగా పనిచేసన బాబాగౌడ పాటిల్, సురేష్ అనగాడిలు బెళగావి నుంచి ప్రాతినిథ్యం వహించారు. మరాఠాల ఆధిపత్యం వున్న ఈ ప్రాంతంలో ఎక్కువగా మహారాష్ట్ర ఆచార వ్యవహారాలే కనిపిస్తుంటాయి. 

బెళగావి ఎంపీ (లోక్‌సభ) ఎన్నికల ఫలితాలు 2024 .. 20 ఏళ్లుగా ఓడిపోని బీజేపీ :

Latest Videos

బెళగావి నార్త్, బెళగావి సౌత్ నియోజకవర్గాలను రద్దు చేసి 1957లో బెళగావి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. నాటి నుంచి 1991 వరకు బెళగావిలో కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం. 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ కంచుకోటను జనతాదళ్ అభ్యర్ధి శివానంద్ కౌజాలగి బద్ధలుకొట్టారు. ఆ తర్వాత 2004లో సురేష్ అనగాడి ఎంట్రీతో బెళగావి పూర్తిగా బీజేపీ కంట్రోల్‌లోకి వచ్చేసింది. నాటి నుంచి మరణించే వరకు సురేష్ ఎంపీగా వున్నారు. మోడీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సురేష్‌ను రైల్వే శాఖ సహాయ మంత్రిగా నియమించారు. అయితే దురదృష్టవశాత్తూ 2020లో కరోనా బారినపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అనంతరం సురేష్ సతీమణి మంగళ సురేష్ అనగాడి ఉపఎన్నికలో ఎంపీగా గెలుపొందారు. 

బెళగావి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అరభావి, గోకక్, బెళగావి ఉత్తర్, బెళగావి దక్షిణ్, బెళగావి రూరల్, బెయిల్‌హోంగల్, సౌండట్టి ఎల్లమ్మ, రాందుర్గ్ అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బెళగావి సెగ్మెంట్ పరిధిలోని 8 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 3 చోట్ల, కాంగ్రెస్ 5 చోట్ల విజయం సాధించాయి. బెళగావి లోక్‌సభ పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 18,07,250 మంది. వీరశైవ లింగాయత్, మరాఠాలు ఇక్కడ బలమైన శక్తులుగా వున్నారు. బెళగావిలో కాంగ్రెస్ పార్టీ 11 సార్లు, బీజేపీ 6 సార్లు, జనతాదళ్ ఒకసారి విజయం సాధించాయి. 

బెళగావి ఎంపీ (పార్లమెంట్ ) ఎన్నికల ఫలితాలు 2024 .. పాగా వేయాలని కాంగ్రెస్ :

2024 ఎన్నికల విషయానికి వస్తే.. బెళగావిలో పట్టు కోల్పోకూడదని కమలనాథులు కృతనిశ్చయంతో వున్నారు. కిత్తూరు కర్ణాటక ప్రాంతంలో కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్‌ను బీజేపీ తన అభ్యర్ధిగా బరిలో దించింది. వీరశైవ లింగాయత్ కమ్యూనిటీతో పాటు స్థానిక నేత కావడం, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా తనను గెలిపిస్తాయని జగదీశ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే.. తన ఒకప్పటి కంచుకోటలో తిరిగి పాగా వేయాలని ఆ పార్టీ భావిస్తోంది. తన అభ్యర్ధిగా మృణాల్ రవీంద్ర హెబ్బాల్కర్‌ను ప్రకటించింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వుండటం.. బెళగావి లోక్‌సభ పరిధిలో పార్టీ బలంగా వుండటంతో ఈసారి తాను గెలుస్తానని మృణాల్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

click me!