‘కశ్మీర్ ఫైల్స్ ప్రాపగాండనే’.. నడవ్ లాపిడ్‌ను సమర్థించిన మరో ముగ్గురు జ్యూరీ సభ్యులు

By Mahesh KFirst Published Dec 4, 2022, 1:05 PM IST
Highlights

కశ్మీర్ ఫైల్స్ వల్గర్ ప్రాపగాండ మూవీనే అని ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీ సభ్యులు ముగ్గురు నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలకు తాము కట్టుబడి ఉన్నామని ముగ్గురు సభ్యులు ఓ ప్రకటనను విడుదల చేశారు.
 

న్యూఢిల్లీ: గోవా వేదికగా జరిగిన ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ముగింపు కార్యక్రమంలో జ్యూరీ హెడ్, ఇజ్రాయెలీ ఫిలిం మేకర్ నడవ్ లాపిడ్.. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. సినీ ప్రపంచం, రాజకీయ నేతల నుంచి ఈ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా వల్గర్, ప్రాపగాండ మూవీ అని నడవ్ లాపిడ్ వ్యాఖ్యానించారు. ఇది జ్యూరీ సభ్యులందరి అభిప్రాయం అని తెలిపారు.తాజాగా, ఆయన వ్యాఖ్యలను మరో ముగ్గురు జ్యూరీ సభ్యులు సమర్థించారు. జింకో గొటో, పాస్కాల్ చావెన్స్, జేవియర్ యాంగులో బర్టరన్‌లు సంయుక్తంగా ఓ ప్రకటనను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

దీంతో ఐఎఫ్ఎఫ్ఐ జ్యూరీలో సభ్యుడిగా ఉన్న భారత ఫిలిం మేకర్ సుదీప్తో సేన్ మాత్రమే నడవ్ లాపిడ్ వ్యాఖ్యలను అంగీకరించలేదని అర్థం అవుతుంది. నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతం అని ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే.

Also Read: సారీ.. కానీ, నా వ్యాఖ్యలు సుస్పష్టం.. ఆ సినిమా అలాంటిదే: ఇజ్రాయెలీ ఫిలిం మేకర్ నడవ్ లాపిడ్

ఫిలిం ఫెస్టివల్ క్లోజింగ్ సెరెమనీలో జ్యూరీ అధ్యక్షుడు నడవ్ లాపిడ్ జ్యూరీ సభ్యుల తరఫున కామెంట్ చేశాడు. ‘15వ సినిమా ది కశ్మీర్ ఫైల్స్ సినిమా పై తామంతా డిస్టర్బ్ అయ్యాం. షాక్‌కు గురయ్యాం. ఈ సినిమా మాకు ఒక వల్గర్ ప్రాపగాండగా తోచింది. ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్‌లో ఆర్టిస్టిక్ కాంపిటీటివ్ సెక్షన్‌లో ఇలాంటి సినిమా రావడం సరికాదని అనిపించింది. నడవ్ లాపిడ్ ప్రకటనకు మేం కట్టుబడి ఉన్నాం’ అని తాజాగా, ముగ్గురు జ్యూరీ సభ్యులు చేసిన ప్రకటనలో ఉన్నది.

‘అదే విధంగా మేం ఫిలిం కంటెంట్ పై రాజకీయ వైఖరి తీసుకోవడం లేదని స్పష్టం చేస్తున్నాం. మేం కేవలం ఒక ఆర్టిస్టిక్ స్టేట్‌మెంట్ చేస్తున్నాం. ఫిలిం ఫెస్టివల్ వేదికను రాజకీయానికి, నడవ్ లాపిడ్ పై వ్యక్తిగత దాడికి వినియోగించడం తమకు బాధను కలిగించింది. జ్యూరీకి అలాంటి ఉద్దేశ్యాలేమీ లేవు’ అని వారు వివరించారు.

జింకో గొటో ఆస్కార్ నామినేటెడ్ అమెరికన్ ప్రొడ్యూసర్. జేవియర్ ఏ బర్టరన్ డాక్యుమెంటరీ ఫలిం మేకర్, ఫ్రాన్స్‌కు చెందిన జర్నలిస్టు. పాస్కాల్ చావెన్స్ ఫ్రాన్స్‌కు చెందిన ఫిలిం ఎడిటర్.

Also Read: స్వేఛ్చగా మాట్లాడలేని ఇలాంటి దేశాల్లో ఎవరో ఒకరు నోరువిప్పాలి.... ది కాశ్మీర్ ఫైల్స్ వివాదంపై నడవ్ లాపిడ్ వివరణ

నడవ్ లాపిడ్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా దుమారం లేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇజ్రాయెలీ దౌత్య అధికారి నార్ గిలన్ స్పందిస్తూ నడవ్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. కాగా, నడవ్ లాపిడ్ తన వ్యాఖ్యలను ఆ తర్వాత ఇజ్రాయెల్ వెళ్లాక కూడా సమర్థించుకున్నారు. తాను కశ్మీరీ పండిట్ల విషాదాన్ని తిరస్కరించలేదని, కానీ, ది కశ్మీర్ ఫైల్స్ ఒక సినిమాటిక్ మ్యానిపులేషన్‌గా ఉన్నదని అన్నారు. వారి విషాదం పై ఒక సీరియస్ సినిమా ఉండాలని తన అభిప్రాయం అని తెలిపారు.

click me!