అంతా బాగానే ఉంటుంది అక్క.. ఏడుస్తూంటే ఓదార్చిన బుడ్డోడు.. వైరల్ అవుతున్న వీడియో..

Published : Dec 04, 2022, 11:33 AM IST
అంతా బాగానే ఉంటుంది అక్క.. ఏడుస్తూంటే ఓదార్చిన బుడ్డోడు.. వైరల్ అవుతున్న వీడియో..

సారాంశం

తోబుట్టువుల మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరిపై ఒకరికి ఉండే.. అప్యాయత, ప్రేమ అనిర్వచనీయమనే చెప్పాలి. చాలా మందికి బాధలో ఉన్న, కష్టంలో ఉన్న  తోబుట్టువులు దన్నుగా నిలస్తుంటారు.

తోబుట్టువుల మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకరిపై ఒకరికి ఉండే.. అప్యాయత, ప్రేమ అనిర్వచనీయమనే చెప్పాలి. చాలా మందికి బాధలో ఉన్న, కష్టంలో ఉన్న  తోబుట్టువులు దన్నుగా నిలస్తుంటారు. తాజాగా అక్కాతమ్ముళ్ల మధ్య అప్యాయత ఎలా ఉంటుందో తెలిపే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఓ ఏడేళ్ల బుడ్డోడు.. ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న  తన అక్కను ఓదార్చుతున్నాడు. ఈ వీడియో చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. చాలా మంది తమ జీవితంలోని ఇలాంటి ఘటనలను గుర్తుచేసుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో  PAPz పేరుతో ఉన్న యూజర్ షేర్ చేశారు. ఇందులో ఓ యువతి కూర్చీలో కూర్చొని ఏడుస్తూ ఉండగా.. అక్కడికి వచ్చిన బుడ్డోడు ఆమెను ఓదార్చడం కనిపిస్తోంది. ఆమె మొహన్ని పట్టుకుని, కన్నీళ్లను కూడా తుడిచాడు. ఈ వీడియోను షేర్ చేసిన యూజర్.. ‘‘ఇది గత సంవత్సరం 2021లో జరిగింది. నా సోదరుడు ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా అతను నా సోదరి ఏడుపును చూశాడు. వెంటనే అన్ని వదలిపెట్టి ఆమె దగ్గరికి పరుగెత్తాడు. సరిగ్గా ఉందో లేదో చూడటానికి ఆమె వద్దకు చేరుకున్నాడు. 

నన్ను చూడటం ద్వారా, నేను ఏదైనా చేశానా? లేదా? అని అడగడం ద్వారా.. ఆమెకు ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అతనికి 7 సంవత్సరాల వయస్సు ఉంది. కానీ ఆమె కోసం అక్కడే కూర్చుని.. అది ఆమె చెడ్డ రోజు అని అర్థం చేసుకునే పరిపక్వత ఉంది. ఆమె బాగా లేదని అర్థం చేసుకుని.. అంతా బాగానే ఉంటుందని భరోసా ఇచ్చాడు’’ అని పేర్కొన్నారు. 

 


ఈ వీడియో నవంబర్ 7న షేర్ చేయబడింది. ఇప్పటివరకు ఈ వీడియోకు ఆరు మిలియన్లకు పైగా వ్యుస్ వచ్చాయి. నాలుగు లక్షలకు పైగా లైక్‌లను సంపాదించింది. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోను చూసి భావోద్వేగానికి గురయ్యారు. ఇలాంటి అనుభవాన్ని పంచుకుంటూ ఒక యూజర్.. ‘‘నా సోదరుడు ఇప్పుడు 11 ఏళ్ల వయస్సులో ఉన్నాడు. నేను చాలాసార్లు చాలా ఏడుస్తుంటాను. అతను ప్రతిసారీ నా తల, వెన్ను తట్టాడు. నేను హాస్టల్ నుంచి వచ్చినప్పుడల్లా నన్ను కౌగిలించుకుంటాడు. నాకు ఏమి కావాలో అతనికి తెలుసు. మాకు ఇప్పుడు 10 సంవత్సరాల వయస్సు తేడా ఉంది. నాకు ఇప్పుడు 21 సంవత్సరాలు. కానీ అతను కొన్నిసార్లు నాకు అన్నయ్య అవుతాడు’’ అని కామెంట్ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu