ఓ భర్త తన భార్యపై శాడిజం చూపించాడు. ఆమెను 12 ఏళ్ల పాటు ఇంట్లోనే బంధించాడు. ఇంట్లో టాయిలెట్ సౌకర్యం కూడా కల్పించలేదు. దీంతో ఆమె టాయిలెట్స్ కోసం బాక్సులను ఉపయోగించింది. (In Mysore, Karnataka, a husband has locked his wife in the house for 12 years) తాజాగా పోలీసులు ఆమెను రక్షించారు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరులో వెలుగులోకి వచ్చింది.
husband has locked his wife : కర్ణాటకలో దారుణం జరిగింది. ఓ భర్త తన భార్యను 12 ఏళ్లుగా ఇంట్లోనే బంధించాడు. ఈ ఘటన మైసూరు జిల్లాలో జరిగింది. ఈ విషయం తెలియడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితురాలను రక్షించారు. అయితే ఆమె భర్తపై కేసు పెట్టడానికి నిరాకరించింది. తన తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటానని నిర్ణయించుకుంది.
ట్రక్కు డ్రైవర్లకు మోడీ శుభవార్త .. త్వరలో హైవేలపై 1000 విశ్రాంతి కేంద్రాలు , ఫుల్ ఫెసిలిటీస్‌తో
బాధితురాలు తెలిపిన వివరాలు, ‘ఇండియా టుడే’ కథనం ప్రకారం.. మైసూరు జిల్లాలో ఉండే దంపతులకు 12 ఏళ్ల కింద వివాహం జరిగింది. భర్తకు భార్యపై అభద్రతా భావం ఏర్పడింది. దీంతో ఆమెను బయటకు ఎక్కడికీ తీసుకెళ్లేవాడు. ఆమెను ఇంట్లోనే ఉంచేవాడు. కొంత కాలం తరువాత వారికి ఇద్దరు పిల్లలు జన్మించారు. పిల్లలను స్కూల్ కు పంపించినా.. భార్యను మాత్రం ఇంట్లోనే బంధించి ఉంచాడు. అతడు పని ముగించుకొని ఇంటికి వచ్చే వరకు తాళం వేసి ఉంచేవాడు.
ముస్లిం వర్గానికి చుక్కెదురు.. జ్ఞాన్ వాపిలో పూజలు కొనసాగించవచ్చని చెప్పిన అలహాబాద్ హైకోర్టు
పిల్లలను స్కూల్ నుంచి తిరిగి వచ్చినా బయటే వేచి ఉండేవారు. ఆ ఇంట్లో టాయిలెట్ కూడా లేకపోవడంతో ఆమె బాక్స్ లు ఉపయోగించేది. ‘‘నాకు పెళ్లయి 12 ఏళ్లు అవుతోంది. భర్త ఎప్పుడూ నన్ను ఇంట్లో బంధించి చిత్రహింసలకు గురిచేసేవాడు. ఈ ప్రాంతంలో ఎవరూ ఆయనను ప్రశ్నించరు... నా పిల్లలు బడికి వెళ్తారు. కానీ నా భర్త పని నుంచి తిరిగి వచ్చే వరకు వారు బయటే ఉంటారు. కిటికీ ద్వారా వారికి ఆహారం ఇస్తాను’’ బాధిత మహిళ వాపోయింది.
రాజ్యసభలో నిద్రపోయిన కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్.. వీడియో వైరల్..
బాధిత మహిళ గతంలో అప్పుడప్పుడు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి వచ్చేదని, కానీ తరువాత ఇంటికే పరిమితం చేశాడని పోలీసులు తెలిపారు. కానీ తనను మూడు వారాలే భర్త బంధించి ఉంచాడని బాధితురాలను చెప్పిందని పోలీసులు వెల్లడించారు. భర్త భార్యపై అభద్రతా భావానికి గురయ్యాడని, అతడికి కౌన్సిలింగ్ ఇచ్చామని చెప్పారు. ఆమె భర్తకు మూడో భార్య అని తెలిపారు. బాధితురాలికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చామని పేర్కొన్నారు. భర్తపై ఫిర్యాదు చేయడం ఆమెకు ఇష్టం లేదని, తల్లిదండ్రుల ఇంట్లోనే ఉండి తన వైవాహిక సమస్యలను పరిష్కరించుకుంటానని చెప్పిందని తెలిపారు.