భార్యకు తెలియకుండా రెండో పెళ్లికి సిద్ధమైన భర్త.. పెళ్లి పీటల మీద పెద్ద ట్విస్ట్.. ఏం జరిగిందంటే ?

By team teluguFirst Published Oct 30, 2022, 11:10 AM IST
Highlights

మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకముందే రెండో పెళ్లికి రెడీ అయ్యాడు ఓ భర్త. ఈ విషయం తెలుసుకున్న భార్య సరాసరి పెళ్లి మండపానికి వచ్చింది. ఆ పెళ్లి కూతురు తల్లిదండ్రలకు విషయం చెప్పి అతడిని అరెస్టు చేయించింది. 

అతడికి ఇది వరకే పెళ్లి అయ్యింది. భార్యతో అతడికి మనస్పర్థలు రావడంతో కొంత కాలం నుంచి దంపతులు దూరంగా ఉంటున్నారు. విడిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇంకా విడాకుల దాకా పోలేదు. అయితే ఆమెతో ఎలాగో తెగదింపులు చేసుకోవాలని అనుకున్న భర్త.. మరో పెళ్లికి సిద్ధం అయ్యాడు. పెళ్లి పీటల మీద కూర్చున్న సమయానికి భార్య ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.

ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, విద్య ప్ర‌భుత్వ బాధ్య‌త‌.. ప్ర‌యివేటీక‌ర‌ణ ఆపి.. ప్ర‌భుత్వం జోక్యం పెర‌గాలి: రాహుల్ గాంధీ

వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులో మరుసూధన్, వసుధ భార్యభర్తలు. అయితే ఈ దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో దూరంగా ఉంటున్నారు. విడాకాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఇంకా ఆ విషయం కోర్టులోనే ఉంది. కానీ ఈ లోపే అతడు రెండో వివాహానికి రెడీ అయ్యాడు. 

తన సోదరి సహాయంలో హాసన సిటీకి చెందిన ఓ యువతిని విహహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే మరుసూధన్ కు ఇది రెండో పెళ్లి అనే విషయం ఆ యువతి తల్లిదండ్రులు తెలియదు. దీంతో పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. అదే సిటీలోని ఓ కల్యాణ మండపం చూసి శుక్రవారం పెళ్లికి అన్ని సిద్ధం చేశారు. ఇక పెళ్లి చేసుకోడమే మిగిలి ఉంది.

ఈ విషయం నేను మోదీని అడగాలని అనుకుంటున్నాను.. : యూసీసీపై గుజరాత్ ప్రభుత్వ ప్రకటనపై మండిపడ్డ ఒవైసీ

అయితే మరుసూధన్ రెండో పెళ్లికి సిద్ధం అయ్యాడని భార్య వసుధకు సమాచారం అందింది. దీంతో పెళ్లి ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలని అనుకుంది. చివరికి ఇంటర్ నెట్ సాయంతో పెళ్లి మండలం అడ్రెస్ కనుక్కొంది. అక్కడికి బయలుదేరింది. ఆ లోపే పెళ్లి పీటల మీద భర్త రెడీగా ఉన్నాడు. మండలంలోని పెళ్లి కూతురు తల్లి, తండ్రిని కలిసింది. 

పెళ్లి పీటల మీద కూర్చున్న వ్యక్తికి ఇది వరకే పెళ్లి జరిగిందని, తానే భార్యనని చెప్పింది. మరుసూధన్ వల్ల తన జీవితం నాశనం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేసింది. మీ కూతురు లైఫ్ ను ఎందుకు ఇబ్బందుల్లోకి నెట్టేస్తారని సూచించింది. అతడికి ఇది రెండో పెళ్లిని తెలిసిన ఆ యువతి తల్లిదండ్రులు తీవ్రంగా బాధపడ్డారు. వెంటనే మరుసూధన్ ను ఓ రూమ్ లో పెట్టి లాక్ చేశారు. అనంతరం పోలీసులకు ఈ సమాచారం అందించారు. 

జమ్మూ కాశ్మీర్ లో విరిగిపడ్డ కొండచరియలు.. నలుగురు మృతి, ఆరుగురిని రక్షించిన రెస్క్యూ సిబ్బంది

వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఇక ఎలాంటి అడ్డంకులూ లేకుండా పెళ్లి జరిగిపోతుందని భావించిన నిందితుడు.. తెల్లారి హనీమూన్ కు వెళ్లాలని ప్లానింగ్ చేసుకున్నాడు. దీని కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. పాస్ పోర్ట్, విమానం టిక్కెట్లు అన్ని సిద్ధం చేసుకున్నాడు. కానీ పెళ్లి క్యాన్సిల్ అవడంతో అతడి ఆశలన్నీ నీరుగారిపోయాయి.

click me!